Telugu News » Blog » RRR టీమ్ ఆస్కార్ ప్రయాణ ఖర్చులను భరించింది అతడేనా..?

RRR టీమ్ ఆస్కార్ ప్రయాణ ఖర్చులను భరించింది అతడేనా..?

by Anji
Ads

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించినటువంటి RRR  చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావాలని ఎంతో పట్టుదలతో చేసినటువంటి ప్రయత్నం ఎట్టకేలకు సఫలమైంది. నాటు నాటు పాట అద్భుతమైన సక్సెస్ సొంతం చేసుకొని భారీస్పందన సొంతం చేసుకున్న విషయం విదితమే. ప్రపంచ వ్యాప్తంగా నాటు నాటు పాట గురించి ప్రచారం జరిగే విధంగా భారీ ఎత్తున ఖర్చు చేశారు. 

Advertisement

Also Read :  ‘నాటు నాటు’కు ఆస్కార్.. తమ్మారెడ్డి రియాక్షన్ ఇదే..!

Advertisement

పలు అంతర్జాతీయ వేదికలపై నాటు నాటు పాట ప్రసారం అయ్యేవిధంగా రాజమౌళి తీవ్రంగా ప్రయత్నించారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలతో ఒప్పందాలకు కుదుర్చుకొని ఈ సినిమాకు పబ్లిసిటీ చేశారు. విదేశాలకు వెళ్లేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు చేశారు. మొత్తానికి తమ్మారెడ్డి భరద్వాజ అన్నట్టు ఈ సినిమా పబ్లిసిటీ కోసమే దాదాపు రూ.80 కోట్ల రూపాయలను ఖర్చు చేశారట. ఆస్కార్ అవార్డు రావడంతో ఆ రూ.80 కోట్ల రూపాయల ఖర్చు గురించి ఏ ఒక్కరూ మాట్లాడడం లేదు. మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే.. 1000 కోట్ల రూపాయల విలువ అయినా ఆస్కార్ అవార్డు సొంతం అయింది. రూ.80 కోట్ల రూపాయలను ఎవరు ఖర్చు చేశారని కొద్ది మందికి అనుమానం కలుగుతుంది. 

Also Read :  టాలీవుడ్ లో మరో బంపర్ కొట్టేసిన జాన్వీ కపూర్ !

Manam News

సినిమాని దానయ్య నిర్మించిన విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో కనిపించడం లేదు. ప్రతి వేదిక పై కూడా రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి తనయుడు కార్తికేయ కనిపించారు. దానయ్య మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఖర్చు మొత్తం కూడా రాజమౌళి కుటుంబ సభ్యులు భరించినట్టుగా తెలుస్తోంది. కేవలం ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవాలని పట్టుదలతో రాజమౌళి టీమ్ భారీ ఎత్తున ఖర్చు చేయడం జరిగింది. ఆస్కార్ దక్కితే ఆ పెట్టిన పెట్టుబడికి 10 రెట్ల అదనపు లాభం రాజమౌళికి దక్కే అవకాశముంటుంది. నిర్మాత దానయ్య రాజమౌళి భారీ ఎత్తున ఖర్చు చేశారని సమాచారం.  

Advertisement

Also Read :  బాల‌య్య ఒక్క‌డే మా కుటుంబం…తార‌క‌ర‌త్న భార్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!