Home » సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి అసలు కారణం అదేనా..?

సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి అసలు కారణం అదేనా..?

by Anji
Ad

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత కలిసి నటిస్తున్న ఖుషి మూవీ షూటింగ్ నిన్నటితో పూర్తి అయిన విషయం తెలిసిందే. అలాగే సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ సిరీస్ సిటాడెల్ తరువాత సమంత ఏ సినిమా చేయబోతుందా అని అభిమానులందరూ ఎదురుచూస్తున్న తరుణంలో సమంత సినిమాలకు బ్రేకు ఇవ్వననున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

సమంత బ్రేక్ తీసుకోవడంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఆమెకు ఉన్న మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తి కోలుకోవాలంటే కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవడం చాలా మంచిది అని డాక్టర్లు సలహా ఇవ్వడంతో సమంత ఈ నిర్ణయం తీసుకుందని అనుకుంటుండగా.. తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. నాగచైతన్యతో విడాకుల తరువాత నుంచి ఒంటరిగానే ఉంటున్న సమంత త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందట. ఆమె చిన్నప్పటి నుంచి స్నేహితుడు అయిన ఓ వ్యక్తి ప్రస్తుతం బిజినెస్ రంగంలో మంచి పొజిషన్ లో ఉండగా.. ఆ వ్యక్తి సమంతకు రెండో పెళ్లి గురించి ప్రపోజల్ తీసుకురాగా.. సమంత ఆలోచించుకోవడానికి సమయం అడిగిందనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

గతంలో ఆమె ఈ విషయంపై ఇన్ స్టా గ్రామ్ ఓ పోస్ట్ కూడా చేసింది. కానీ మళ్లీ ఏమైందో ఏమో వంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసింది. అయితే గతంలో మాదిరిగానే హుటాహుటిన నిర్ణయాలు తీసుకోకూడదని అనుకున్న సమంత్ ఏడాది సమయంపాటు ఆ వ్యక్తిని అర్థం చేసుకొని.. ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అంగీకారం తెలపడానికి సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. ఈ విషయం ఏ మేరకు వాస్తవమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Sai Sushanth Reddy : నిశ్చితార్థం చేసుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ నటుడు..

బాలయ్య పక్కనే ఉన్న ఈ బాబు ఎవరో తెలుసా ? ప్రస్తుతం స్టార్ హీరో..!

Visitors Are Also Reading