Home » పది నిమిషాల పాటు డైలాగ్ లేకుండా కేవలం ఎక్స్ ప్రెషన్ తోనే నటించిన సినిమా ! కేవలం మెగాస్టార్ కి మాత్రమే సాధ్యం

పది నిమిషాల పాటు డైలాగ్ లేకుండా కేవలం ఎక్స్ ప్రెషన్ తోనే నటించిన సినిమా ! కేవలం మెగాస్టార్ కి మాత్రమే సాధ్యం

by Anji
Ad

చిరంజీవి హీరోగా గుణశేఖర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ చూడాలని వుంది. అశ్వినిదత్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా విశేషంగా అలరించింది. సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన పాటలు ఎవ్వర్ గ్రీన్ అనే చెప్పుకోవాలి. చిరంజీవి అంజలా ఝావేరి మధ్య వచ్చే రైల్వే స్టేషన్ లవ్ సీన్ అయితే చాలా స్పెషల్ గా ఉంటుంది. చిరు, అంజలీ ల మధ్య డైలాగ్స్ లేకుండా కేవలం హావభావాలతో ఆ సన్నివేశాన్ని తెరకెక్కించి అలరించాడు గుణశేఖర్.

Advertisement

ఆ సీన్ గురించి ఓ సందర్భంలో డైరెక్టర్ గుణశేఖర్ ఇలా చెప్పుకొచ్చాడు. రైల్వే స్టేషన్ లో ఆ లవ్ సీన్ దాదాపు 10 నిమిషాల పాటు ఉంటుంది. చిరంజీవి గారికి అస్సలు డైలాగ్స్ ఉండవు. ఆయన రైల్వే స్టేషన్ లో చైర్ మీద కూర్చొని అమ్మాయిని చూస్తూ ఉంటారు అని చెప్పగానే.. అశ్వనిదత్ షాక్ అయిపోయారు. పైగా ఈ సన్నివేశం షూట్ చేయడానికి నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు కావాలని అడిగారు. అశ్వనిదత్ ఆశ్చర్యపోవడంలో తప్పులేదు. ఎందుకంటే ప్రేమ్ లో చిరంజీవి ఉండి కూడా డైలాగ్స్ లేకుండా ఒక్క నిమిషం పాటు సన్నివేశం నడపాలంటేనే చాలా కష్టమైన విషయం.. అలాంటిది  ఏకంగా 10 నిమిషాల పాటు అంటే ఇంపాజిబుల్ అనుకున్నారు. పైగా ఈ సన్నివేశం తీయడానికి నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు కావాలంటే జరిగే పని కాదు అనుకున్నారు.

Advertisement

 

ఎందుకంటే అప్పట్లో నాంపల్లి రైల్వే స్టేషన్ చాలా పెద్దది. అనేక రైళ్లు రాకపోకలు సాగించేవి. అలాంటి రద్వీ ఏరియాల్లో మూడు రోజుల పాటు చిరంజీవి గారిని పెట్టుకొని షూట్ చేయడం చాలా కష్టం. చిరంజీవితో షూటింగ్ అంటే ఇబ్బందులు అనే దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ అనుమతి ఇవ్వదు. ఎందుకంటే ఇక్కడ షూటింగ్ జరుగుతుంటే ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. రైళ్లు ఆగిపోతాయి. రైల్వే సమయాలు మారిపోతాయి. ఎలాగైతేనేం చివరికీ అతికష్టం మీద రైల్వే శాఖ అనుమతి లభించింది. అలా షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 

Also Read : రాజశేఖర్ కారణంగా తన అవకాశాలను కోల్పోయిన శ్రీకాంత్ ఎలాగంటే?

Visitors Are Also Reading