Home » శ్రీకాంత్ సినిమా అవకాశాలను రాజశేఖర్ దెబ్బ తీసారా? ఎలాగంటే?

శ్రీకాంత్ సినిమా అవకాశాలను రాజశేఖర్ దెబ్బ తీసారా? ఎలాగంటే?

by Anji
Ad

సాధారణంగా ఏ సినిమా కథ  అయినా దానికి తగినట్టు నటీనటులను ఎంపిక చేసుకుంటారు దర్శక, నిర్మాతలు. కొన్ని సార్లు అనివార్య కారణాలు, పారితోషికాలు, అభిప్రాయాల భేదాల కారణంగా తొలుత అనుకున్న నటీనటులు కాకుండా కొత్త వారు ఆ పాత్రలు చేయడం సహజంగానే జరుగుతుంది. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో అడుగులు వేస్తున్న హీరోలు ప్రతీ అవకాశాన్ని సదవకాశంగా భావిస్తారు. సినిమా అవకాశం చేజారిపోతే ఎంతో బాధపడుతారు. తెలుగు హీరో శ్రీకాంత్ కి కూడా తొలినాళ్లలో ఓ సినిమాకి హీరోగా వచ్చిన అవకాశం చేజారిపోయింది.

rajashekar-and-srikanth

Advertisement

 

ఆ పాత్రను మరో హీరో రాజశేఖర్ చేశారు. హిందీలో విజయవంతమైన బాజీఘర్ సినిమా హక్కులను చరిత్ర చిత్ర నిర్మాణ సంస్థ కొనుగోలు చేసింది. శ్రీకాంత్ హీరోగా వేటగాడు పేరుతో షిండే దర్శకత్వంలో సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. హీరోయిన్లుగా సౌందర్య, రంభ నటిస్తున్నారని తెలిసి శ్రీకాంత్ చాలా సంతోషపడ్డాడు. ఏమైందో ఏమో తెలియదు.. కానీ మరో నాలుగు రోజుల్లో షూటింగ్ మొదలవుతుందనగా శ్రీకాంత్ ని కాదని రాజశేఖర్ ని హీరోగా తీసుకున్నారు. షిండే స్థానంలో తమ్మారెడ్డి భరధ్వాజ దర్శకత్వం చేయాల్సి వచ్చింది.

Advertisement

 

కెరీర్ ప్రారంభంలోనే అలాంటి అవకాశం చేజారీపోవడంతో తాను చాలా బాధపడ్డానని శ్రీకాంత్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అదే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించాడు శ్రీకాంత్. ఆ తరువాత తాజ్ మహల్ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక పెళ్లి సందడి తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒకదశలో ఏడాదికి 13 సినిమాలు రిలీజ్ చేసే స్థాయికి చేరాడు. ఆ సినిమా మిస్ చేసుకున్న తరువాత చాలా రోజులకు దర్శకుడు షిండే-హీరో శ్రీకాంత్ కలిసి నిన్నే ప్రేమిస్తా  వంటి హిట్ అందుకున్నారు. శ్రీకాంత్ ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పలు వైవిద్యమైన పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు.

Also Read :  మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading