ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు అంటే దర్శక ధీరుడు రాజమౌళి గుర్తుకొస్తారు. కానీ రాజమౌళి కంటే ముందే భారీ బడ్జెట్ అండ్ టెక్నిక్ వాల్యూస్ తో సినిమాలు అంటే సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ షణ్ముగం పేరు చెబుతుంటారు. మగధీర, ఈగ, బాహుబలి వంటి సినిమాలతో రాజమౌళి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. కానీ జెంటిమెన్ చిత్రంతో మొదలైన శంకర్ సినీ ప్రస్థానంలో ఒక్కో సినిమా ఒక్కో విజువల్ వండర్ అనే చెప్పాలి. కథకు తగినట్టే ఖర్చు పెట్టిస్తారు దర్శకుడు శంకర్. ముఖ్యంగా జీన్స్ సినిమాలోని ఒక సాంగ్ లో అయితే ఏకంగా ప్రపంచంలోని ఏడు వింతలను చూపించాలనుకునే ఆయన ఆలోచన చాలా గ్రేట్ అనే చెప్పాలి.
Advertisement
సాధారణంగా సినిమా థియేటర్లలో పాటలు వస్తున్న సమయంలో కొంత మంది సిగరేట్, టాయిలెట్ కి వెళ్తుంటారు. శంకర్ సినిమాల్లో పాటలు వస్తే మాత్రం ఎవరు లేవకుండా ఉంటారు ఆడియన్స్. ఆ మాయాజాలాన్ని అలాగే కళ్లు అప్పగించి చూస్తూనే ఉంటారు. ప్రేమ కథలతో పాటు లంచం, అవినీతి అనే అంశాలే హైలెట్ గా కథలు రాస్తుంటారు శంకర్. ఇక ప్రజెంటేషన్ విషయానికి వస్తే వేటికి అవే విభిన్నంగా ఉంటాయి. తమిళం, తెలుగుతో పాటు ఆయన భారతదేశం అంతటా అభిమానులను సంపాదించుకున్నారు స్టార్ దర్శకుడు శంకర్. ఇక రజినికాంత్-శంకర్ కాంబోలో రోబో చిత్రం ఫంక్షన్ లో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి మీతో సినిమా చేయాలనుందనే కోరికను బయటపెట్టారంటే.. ఆయన క్రేజ్ ఏంటనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
Advertisement
అలాంటి శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినికాంత్, శ్రీయ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం శివాజీ. ఈ సినిమాలో చిన్న మిస్టేక్ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా విలన్ (సుమన్) దృష్టిలో చనిపోయిన తరువాత రజినీకాంత్ ఎన్టీరంగారావు పేరుతో మరో మారు వేషంలో వస్తాడు. అప్పుడు తను రంగారావు అని.. అమెరికా నుంచి వచ్చానని నిరూపించుకోవడానికి గ్రీన్ కార్డు చూపిస్తారు రజినీ.. 30/05/1974, 2010 లో కార్డు మెంబర్ అయితే.. 2007లో ఎక్స్ ఫైర్ అయినట్టు ఉంటుంది. “యూఎస్ నుంచి వచ్చేటప్పుడు ఏ పోలీస్ చూసుకోడు” అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇక నెటిజన్లు ఎవరికి వారు బుర్రలకు కాస్త పదునుపెట్టి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ.. ఇంటిలిజెంట్స్ లా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ట్విట్టర్ లో తెగ వైరల్ అవుతోంది.