Home » మా నాన్న కంటే భార్యకే ఎక్కువ భయపడతా…వైరల్ అవుతున్న మంచు విష్ణు కామెంట్స్…!

మా నాన్న కంటే భార్యకే ఎక్కువ భయపడతా…వైరల్ అవుతున్న మంచు విష్ణు కామెంట్స్…!

by AJAY
Ad

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆయన సతీమణి వీరానికా రెడ్డి నేడు పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. మోహన్ బాబు తనయుడుగా మంచు విష్ణు టాలీవుడ్ కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఢీ లాంటి సినిమాతో మంచు విష్ణు అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత చాలా సినిమాల్లో హీరోగా నటించాడు.

Advertisement

అంతేకాకుండా మా ఎన్నికల్లో విజయం సాధించి మా అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. దానితోపాటు విద్యానికేతన్ విద్యాసంస్థల బాధ్యతలను సైతం చూసుకుంటున్నారు. ఇక మంచు విష్ణు సీఎం వైఎస్ జగన్ బాబాయ్ కూతురు అయిన వీరానికా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.

Advertisement

వీరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరికి నలుగు సంతానం ఉన్నారు. ఇక నేటితో మంచు విష్ణు వీరానిక ల వివాహం జరిగి 14 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా మంచు విష్ణు సోషల్ మీడియాలో తన భార్యతో దిగిన ఫోటోను షేర్ చేశారు.

అంతేకాకుండా ఆ ఫోటోకు మా నాన్న కంటే నేను ఎక్కువగా భయపడే వ్యక్తి విరాణిక…. అయినా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. హ్యాపీ యానివర్సరీ అంటూ రాసుకువచ్చారు. ఇక వీరి ప్రేమ ఎలా మొదలైందంటే…. మొదట మంచు విష్ణు విరాణిక స్నేహితులుగా ఉన్నారు. ఆ తర్వాత ప్రేమించుకున్నారు. 2009లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వీరానికా సినిమాలకు డిజైనర్ పనిచేశారు.

Visitors Are Also Reading