Home » “విక్రమ్” మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఈ పిల్లాడు ఎవరో తెలుసా..?

“విక్రమ్” మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఈ పిల్లాడు ఎవరో తెలుసా..?

by Sravanthi
Ad

ప్రముఖ నటుడు కమలహాసన్ హీరోగా నటించిన విక్రమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. యంగ్ దర్శకుడు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామాగా స్టార్స్ విజయ్ సేతుపతి , ఫహద్ పజిల్ మరియు సూర్య కీలక పాత్రలో నటించారు. విక్రమ్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ చిత్రంలోని అన్ని పాత్రలు మంచి గుర్తింపు దక్కించుకున్నాయి. ఇక ఈ సినిమాలో కమలహాసన్ మనవడిగా నటించిన చైల్డ్ ఆర్టిస్టు పాత్ర కు ప్రేక్షకులు విశేషంగా కనెక్ట్ అయ్యారు. విక్రమ్ సినిమా రిలీజ్ అయినప్పటినుండి చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన చిన్నపిల్లాడు ఎవరా అని చాలామంది ఆరా తీయడం మొదలుపెట్టారు.

also read:ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా…? ఇప్పుడు టాలీవుడ్ బడా హీరో భార్య!

Advertisement

Advertisement

అయితే ఈ పాత్ర కోసం చాలామందిని ఆడిషన్ చేశాక ఈ పిల్లాడిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ బాబు పేరేంటి అంటే దర్శన్.. తల్లి పేరు అభినయ. అయితే ఒక సందర్భంలో బేబీ దర్శన్ తల్లి అభినయ మాట్లాడుతూ విక్రమ్ చిత్రంలో మా బాబును చూసి చాలా ఆనందంగా ఉంది. అది కూడా కమల్ సార్ పక్కన ఫుల్ లెన్త్ రోల్ చేయడం అంటే గర్వపడాల్సిన విషయమే. అసలు ఈ చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది అనే ప్రశ్నకు స్పందించిన బాబు తల్లి.. మా ఆయన ఇండస్ట్రీలోనే కాస్టింగ్ ఫీల్డ్ లో వర్క్ చేస్తారు.

also read:Samantha : “శాకుంతలం” ఫ్లాప్ వెనుక నాగచైతన్య…? ఇది స్కెచ్ అంటే

మా మరిది సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేస్తాడు. మా మరిదికి డైరెక్టర్ లోకేష్ కనకరాజుతో మంచి పరిచయం ఉంది. ఆ విధంగా చైల్డ్ ఆర్టిస్ట్ కోసం ఆడిషన్స్ జరిగే టైంలో మా బాబు గురించి లోకేష్ కి చెప్పడం జరిగింది. ఆ తర్వాత బాబును ఆడిషన్ తీసుకెళ్లాం. సెలెక్ట్ అయిపోయారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

also read:Dasara: ఓటీటీలోకి ‘దసరా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Visitors Are Also Reading