Home » ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా…? ఇప్పుడు టాలీవుడ్ బడా హీరో భార్య!

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా…? ఇప్పుడు టాలీవుడ్ బడా హీరో భార్య!

by Bunty
Ad

 

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నమ్రత మహేష్ భార్యనే కాదు, మిస్ ఇండియాగా, హీరోయిన్గా అందరికీ తెలిసిందే. తోలుత సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ లోకి అడుగుపెట్టిన 1993లో మిస్ ఇండియా, మిస్ ఏసియా పసిఫిక్ గా ఎంపిక అయింది.

read also: అంత్యక్రియల అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు… ఎందుకో తెలుసా?

Advertisement

ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు హిందీ సినిమాలలో నటించి మెప్పించింది. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు కలిసి నటించిన వంశీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నమ్రత. తాజాగా నమ్రత తన 51వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈమెకు 51 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ మూడు పదుల వయస్సు కలిగిన అమ్మాయి మాదిరిగానే కనిపిస్తుంది. నమ్రత జనవరి 22, 1972లో మహారాష్ట్ర రాజధాని అయినటువంటి ముంబై నగరంలో జన్మించింది.

Advertisement

read also : కర్నాటక ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్‌ !

It's magical how Mahesh Babu and I found a home in each other: Namrata Shirodkar | Telugu Movie News - Times of India

ఈమె అక్క శిల్పా శిరోద్కర్ కూడా బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు నమ్రత నానమ్మ మీనాక్షి శిరోద్కర్ కూడా ప్రముఖ మరాఠీ నటి. 1938 బ్రహ్మచారి అనే సినిమాలో నటించారు. నానమ్మ వారసత్వంలో శిల్పా, నమ్రతాలు హీరోయిన్స్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. కాగా ఇప్పుడు మహేష్ బాబు భార్య నమ్రత చిన్నప్పటి ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

READ ALSO :  Adipurush : ఆది పురుష్ కు అరుదైన గౌరవం…

Visitors Are Also Reading