Home » జూన్ 30 లోపు ఈ పనులు కచ్చితంగా చేసేయండి.. లేదంటే ఇబ్బందులే!

జూన్ 30 లోపు ఈ పనులు కచ్చితంగా చేసేయండి.. లేదంటే ఇబ్బందులే!

by Srilakshmi Bharathi
Ad

భారత పౌరులుగా ఈ దేశంలో స్వతంత్ర జీవనం అవలంబిస్తున్నప్పటికీ మన జీవితంలో కొన్ని ముఖ్యమైన పనులని సరైన సమయంలో పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంలో ఈ నెల ముప్పయ్యవ తారీకు లోపల కొన్ని పనులను కచ్చితంగా పూర్తి చెయ్యాల్సి ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

june 30

Advertisement

పాన్ కార్డుని, ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సి ఉంటె వెంటనే చేయండి. ఎందుకంటే ఈ నెల 30 వరకే అందుకు గడువు ఉంది. చేయకపోతే, జూన్ 30 తరువాత పాన్ కార్డు చెల్లదు. దీని వలన బ్యాంకు లావాదేవీలను జరుపుకోవడానికి ఇబ్బంది ఎదురవుతుంది. 50 వేల కంటే ఎక్కువ డబ్బు డ్రా చేసుకోవాలన్న, రుణాలు తీసుకోవాలన్నా అనుమతి ఉండదు. ప్రభుత్వ పధకాలు పొందాలన్నా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆన్లైన్ లో అయినా లింక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ పనిని ముందుగా చేసుకోండి.

june 30

అలాగే ఈపీఎఫ్ అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు కూడా ముందుగా ఈ పనిని చేసుకోండి. జూన్ 26 లోపు ఈ పనిని పూర్తి చేసుకోవాలి. గత పది సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఆధార్ ని అప్ డేట్ చేసుకోకపోతే, ఆ పనిని ఈ నెల 30 లోపు చేసుకోండి. ఈ సర్వీస్ ఉచితంగా పొందాలి అంటే మాత్రం జూన్ 14 లోపు చేసుకోవాలి. బ్యాంకు లాకర్ ఉన్న వారు అగ్రిమెంట్ రెన్యూవల్ చేయించుకోవాలి. అలాగే ఎస్బిఐ వారి వీకర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం ఈ నెలాఖరున ముగియబోతుంది. అధిక వడ్డీ కావాలని అనుకుంటే జూన్ 30 లోపు ఈ స్కీం లో చేరాలి. వీరికి 7.5 శాతం వడ్డీ వస్తుంది.

Advertisement

june 30

ఎస్బీఐ అమృత్ కలశ్ కూడా ఈ నెలాఖరుకి ముగియబోతుంది. దీనికి కాలపరిమితి 400 రోజులు. ఈ స్కీం ద్వారా 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే ఇండియన్ బ్యాంకు ప్రవేశ పెట్టిన ‘ఇండ్ సూపర్ 40 డేస్’ కూడా ఈ నెలాఖరున ముగుస్తుంది. గడువు తేదీ లోపు పధకంలో చేరితే, వీరికి 8 శాతం లభిస్తుంది. అలాగే సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొత్త సూచనలు చేసింది. నేరుగా గార్దియన్ల ఖాతా నుంచే మైనర్ల పేరున పెట్టుబడులు పెట్టుకోవచ్చు. జూన్ 15 వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలు లోకి రానున్నాయి.

మరిన్ని ముఖ్య వార్తలు:

సినిమాల్లోకి రాకముందు కృతిశెట్టి డబ్బుల కోసం ఆ పని కూడా చేసిందా ?

మెగాస్టార్ అలా చేయడం వల్లే ఆ పవన్ కళ్యాణ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందా? అసలు విషయం ఏంటంటే?

Sapthagiri : రాజకీయాల్లోకి కమెడియన్ సప్తగిరి… చిత్తూరు నుంచి పోటీ !

Visitors Are Also Reading