Home » సినిమాల్లోకి రాకముందు కృతిశెట్టి డబ్బుల కోసం ఆ పని కూడా చేసిందా ?

సినిమాల్లోకి రాకముందు కృతిశెట్టి డబ్బుల కోసం ఆ పని కూడా చేసిందా ?

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో కృతిశెట్టి పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఉప్పెన మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయినా ఈ బేబమ్మ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా నటన కి నటన, అందానికి అందం, అభినయానికి అభినయం.. ఇలా చాలా రెస్పెక్ట్ ఫుల్ గా మాట్లాడుతుంది. పాత్ర ఏదైనా సరే ఇట్టే అవలీలగా నటించేస్తుంది కృతిశెట్టి. ఉప్పెన మూవీలో సైలెంట్ గా నాన్న మాట వినే కూతురుగా.. శ్యామ్ సింగరాయ్ సినిమాలో ట్రెండీ మోడరన్ గర్ల్ గా.. కస్టడీ సినిమాలో ప్రియుడి కోసం తండ్రిని ఎదురించే అమ్మాయిగా పాత్ర ఏదైనా ప్రాణం పోసేస్తుంది కృతిశెట్టి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

Advertisement

ముఖ్యంగా రీజన్ ఏంట తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో కృతిశెట్టి నటించిన ప్రతీ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలాయి. ప్రారంభంలో మాత్రం సూపర్ హిట్ సాధించాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. సినిమాలలోకి రాకముందు కూడా డబ్బులను బాగానే సంపాదించేదట కృతిశెట్టి. అది ఎలాగంటే.. తాను చదువుకునే రోజుల్లోనే  అడ్వర్ టైజ్ మెంట్ ద్వారా పలు యాడ్స్ లో నటించి డబ్బులు సంపాదించేదట కృతిశెట్టి. 

Advertisement

కృతిశెట్టి ఇలా డబ్బులు సంపాదించేదని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఫేమస్ హీరోయిన్ గా మారడంతో కృతిశెట్టి పలు యాడ్స్ లో నటించాలని ఆఫర్స్ వస్తున్నప్పటికీ.. రిజెక్ట్ చేస్తున్నట్టు సమాచారం. ఓ స్టార్ హీరోయిన్ అసలు యాడ్స్ లో నటించడం ఏంటి అంటూ.. తన వద్దకు వచ్చిన భారీ ఆఫర్స్ రిజెక్ట్ చేసేసిందట కృతిశెట్టి. ముఖ్యంగా ఒకప్పుడు లైఫ్ ఇచ్చిన యాడ్స్ నే ఇప్పుడు ఆమె తొక్కేస్తుందని.. అందుకే ఆమె కెరీర్ ఇలా తగలబడింది అంటూ కొందరూ ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కృతిశెట్టి పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

దర్శకధీరుడు రాజమౌళి 22 ఏళ్ల కెరీర్ లో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సిట్యుయేషన్ ఇదే!

Visitors Are Also Reading