Home » Sapthagiri : రాజకీయాల్లోకి కమెడియన్ సప్తగిరి… చిత్తూరు నుంచి పోటీ !

Sapthagiri : రాజకీయాల్లోకి కమెడియన్ సప్తగిరి… చిత్తూరు నుంచి పోటీ !

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ కమెడియన్ సప్తగిరి గురించి తెలియని వారు ఉండరు. అప్పట్లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో కమెడియన్ గా ఎదిగాడు సప్తగిరి. ఇక ఇప్పుడు ఫుల్ టైం కమెడియన్గా ఎదిగిపోయాడు. అలాగే ఈ మధ్యకాలంలో హీరోగా కూడా సినిమా చేశాడు సప్తగిరి. అయితే తాజాగా కమెడియన్ సప్తగిరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించారు సప్తగిరి.

 

Advertisement

 

త్వరలోనే… రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించేశారు సప్తగిరి. తిరుపతిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు సప్తగిరి… తెలుగుదేశం పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు గారి అభివృద్ధి విజన్ చూస్తూ పెరిగాను…టిడిపి నుండి నాకు ఆఫర్ వచ్చినమాట వాస్తవం అన్నారు. తన రాజకీయ అరంగేట్రం గురించి స్పష్టం చేసిన సప్తగిరి..తెలుగుదేశం పార్టీ నుంచి చిత్తూరు జిల్లాలోని పార్లమెంటు గాని అసెంబ్లీకి గాని పోటీకి సిద్ధంగా ఉన్నానన్నారు.

Advertisement

 

రాజకీయాల్లోకి నేను పుట్టింది చిత్తూరు జిల్లాలోని ఐరాల ప్రభుత్వ ఆసుపత్రిలో…పేదల కష్టాలు నాకు తెలుసు అని చెప్పారు. పేదలకు సేవ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా నా వంతు కృషి చేస్తాను…చంద్రబాబు, లోకేష్ లు ఏమీ ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో రావడానికి నా సేవలు అవసరమైతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి చిత్త శుద్ధితో పనిచేస్తాను అన్నారు కమెడియన్ సప్తగిరి. అయితే తెలుగుదేశం పార్టీలో కమెడియన్ సప్తగిరి ఏ రోజున చేరుతారో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Visitors Are Also Reading