Home » ANR తో కలిసి చేసిన ఈ నలుగురు స్టార్స్ సినిమాలు అట్టర్ ఫ్లాప్…ఆ సినిమాలు ఎవంటే..?

ANR తో కలిసి చేసిన ఈ నలుగురు స్టార్స్ సినిమాలు అట్టర్ ఫ్లాప్…ఆ సినిమాలు ఎవంటే..?

by AJAY
Ad

ఒక‌ప్ప‌టి అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌లో న‌టించి స్టార్ హీరోగా ఎదిగారు. నాగార్జున హీరోగా బిజీ అయిన త‌ర‌వాత వ‌య‌సు పై బ‌డ‌టంతో ఏఎన్ఆర్ హీరోగా కాకుండా సినిమాల్లో కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ లోని స్టార్ హీరోల సినిమాల‌లో కూడా ఏఎన్ఆర్ న‌టించారు. అయితే ఆ సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి.

Advertisement

Also Read: కాస్త ఫేమ్ రాగానే సెలబ్రెటీల మాదిరిగా ఫీల్ అవుతున్నారు…లైవ్ లో సుధీర్ పరువు తీసిన ఏడుకొండలు…!

క‌లియుగ పాండువులు సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన త‌ర‌వాత వెంక‌టేష్ బ్ర‌హ్మ‌రుద్రులు అనే సినిమాలో న‌టించారు. ఈ సినిమాలో ఏఎన్ఆర్ కూడా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాను అశ్వినీద‌త్ నిర్మించారు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ గా నిలిచింది.

Also Read: ఒకే క‌థ‌తో వ‌చ్చిన తండ్రీకొడుకుల‌ సినిమాలు…వాటి రిజ‌ల్ట్ ఏంటంటే..?

Advertisement

మెగాస్టార్ చిరంజీవి బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో మెకానిక్ అల్లుడు అనే సినిమాలో న‌టించారు. ఈ సినిమాలో విజ‌య‌శాంతి మెగాస్టార్ కు జోడీగా న‌టించింది. ఈ సినిమాలో మొద‌టి సారి ఏఎన్ఆర్ చిరుతో క‌లిసి న‌టించారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

బాల‌కృష్ణ రోజా హీరోహీరోయిన్ లుగా ప్రియ‌ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో గాండీవం అనే సినిమా వ‌చ్చింది. ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఏఎన్ఆర్ మ‌రియు మోహ‌న్ లాల్ న‌టించారు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.

Also Read: భార‌త్‌లోకి మంకీపాక్స్ ఎంట్రీ.. కేంద్రం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు..!

అంతే కాకుండా నాగేశ్వ‌ర్ రావు త‌న కుమారుడు నాగార్జున తో కూడా క‌లిసి న‌టించారు. కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున ర‌మ్య‌కృష్ణ హీరోహీరోయిన్ లుగా ఇద్ద‌రూ ఇద్ద‌రే అనే సినిమా వ‌చ్చింది. ఈ సినిమాలో ఏఎన్ఆర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. తండ్రీ కొడుకుల‌ కాంబినేష‌న్ లో ఇది రెండో సినిమా. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.

Visitors Are Also Reading