Home » కాస్త ఫేమ్ రాగానే సెలబ్రెటీల మాదిరిగా ఫీల్ అవుతున్నారు…లైవ్ లో సుధీర్ పరువు తీసిన ఏడుకొండలు…!

కాస్త ఫేమ్ రాగానే సెలబ్రెటీల మాదిరిగా ఫీల్ అవుతున్నారు…లైవ్ లో సుధీర్ పరువు తీసిన ఏడుకొండలు…!

by AJAY
Ad

ఒకప్పుడు జబర్దస్త్ షోలో కమెడియన్ లుగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న పలువురు ప్రస్తుతం ఆ షో నుండి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కాగా జబర్థస్త్ మాజీ కమెడియన్ ఆర్పీ రీసెంట్ ఇంటర్వ్యూలలో జబర్దస్త్ షోపై… నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు. జబర్దస్త్ షోలో చర్లపల్లి జైలు కన్నా ఫుడ్ అద్వానంగా ఉంటుందని ఆర్ పి ఆరోపించాడు. అదేవిధంగా శ్యాంప్రసాద్ రెడ్డిని సైతం విమర్శించాడు. అయితే ఆర్పి అలా ఎందుకు అన్నాడో తెలియదని జబర్దస్త్ లో ఆహారం బానే ఉంటుందని హైపర్ ఆది మరియు రాం ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

అంతేకాకుండా ఆర్పి అబద్ధాలు చెబుతున్నాడని అన్నారు. జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా చేస్తున్న షేకింగ్ శేషు సైతం ఆర్పిని తప్పు పట్టాడు. ఆర్పి పై విమర్శలు గుర్తించాడు. ఆర్పి ఓ మోసగాడు చీటర్ అంటూ ఫైర్ అయ్యాడు ఎవరిదో ఇల్లును చూపించి తన సొంతిల్లు అంటూ చెప్పుకుని యూట్యూబ్ లో డబ్బులు సంపాదించాడని అన్నారు. అదేవిధంగా ఓ నిర్మాత వద్ద సినిమా చేస్తానని చెప్పి 20 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ ఆరోపణలు చేశాడు.

Advertisement

ఇదిలా ఉండగా జబర్దస్త్ పై ఆరోపణలు వస్తున్న అనే ఒకప్పుడు ఆ షోకు మేనేజర్ గా వ్యవహరించిన ఏడుకొండలు కూడా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇంటర్వ్యూలో ఏడుకొండలు జబర్దస్త్ షో కోసం ఎంత కష్టపడ్డామో తమకు తెలుసు అని అన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి జబర్దస్త్ షో మా వల్లే హిట్ అయింది అంటున్నారు… ఏ ఒక్కడి వల్ల జబర్దస్త్ షో సక్సెస్ అవ్వలేదు అని చెప్పారు.

sudheer

sudheer

అందులో అందరి కష్టం ఉందని ప్రొడక్షన్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డామని చెప్పారు. ఫుడ్ భాగోలేదని చెబుతున్నారు కానీ ఒక్కరోజు కూడా అలా జరగలేదని అన్నారు. 10 మందిని వెంటేసుకుని వచ్చినా కూడా వాళ్లకు ఫుడ్ పెట్టామని అన్నారు. బ్రతుకుచ్చిన సంస్థ గురించి అలా మాట్లాడకూడదని ఏడుకొండలు సలహా ఇచ్చారు. అదేవిధంగా సుధీర్ ను తానే జబర్దస్త్ లోకి తీసుకున్నానని చెప్పారు. కానీ ఇప్పుడు తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని అన్నారు. సినిమాల్లో బిజీగా ఉన్నానని చెబుతారు. సుధీర్ నటించిన ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయని ప్రశ్నించారు. కాస్త సేమ్ రాగానే పెద్ద సెలబ్రిటీల లాగా ఫీల్ అయిపోతున్నారంటూ ఏడుకొండలు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా లైవ్ లో సుధీర్ కి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడు అంటూ ఏడుకొండలు చూపించి ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ :“ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నడో తెలుసా..? ఏం చేస్తున్నాడంటే..?

 

Visitors Are Also Reading