Home » భార‌త్‌లోకి మంకీపాక్స్ ఎంట్రీ.. కేంద్రం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు..!

భార‌త్‌లోకి మంకీపాక్స్ ఎంట్రీ.. కేంద్రం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు..!

by Anji
Ad

ప్ర‌పంచ వ్యాప్తంగా మంకీపాక్స్ వ్యాపిస్తోంది. ఇంత‌కు ముందు క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా విజృంభించిన విష‌యం విధిత‌మే. తాజాగా భార‌త్‌లో మంకీపాక్స్ కేసు వెలుగు చూసింది. భార‌త్ లో తొలి కేసు కేర‌ళ‌లో వెలుగులోకి వ‌చ్చింది. వైర‌స్ సోకిన వ్య‌క్తి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా.. కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేప‌ట్టింది అక్క‌డి వైద్య‌శాఖ‌. ఈ త‌రుణంలో మ‌రోవైపు కేంద్ర ఆరోగ్య‌శాక అప్ర‌మ‌త్త‌మైంది. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య శాఖ ప‌లు కీల‌మ మార్గ‌ద‌ర్శ‌కాలను విడుద‌ల చేసింది.


ముఖ్యంగా అంత‌ర్జాతీయ ప్ర‌యాణికులు జ్వ‌రం, జ‌లుబు ఉన్న వారితో స‌న్నిహితంగా ఉండ‌వ‌ద్ద‌ని మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొంది. విదేశాల‌కు వెళ్లేవారు చ‌ర్మ సంబంధ వ్యాదులు, జ‌న‌నేంద్రియ వ్యాదుల‌తో బాద‌ప‌డుతున్న వారికి దూరంగా ఉండాలి. చ‌నిపోయిన లేదా బ‌తికి ఉన్న జంతువుల‌కు నేరుగా తాక‌కూడ‌దు. ప్ర‌ధానంగా రోగులు ఉప‌యోగించిన దుస్తులు, ప‌డ‌క‌, ఇత‌ర వ‌స్తువులను అస‌లు వినియోగించ‌కూడ‌ద‌ని సూచ‌న‌లు చేసింది. అదేవిధంగా అడ‌వి జంతువుల మాంసం విష‌యంలో ఉత్ప‌త్తుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఆఫ్రికా నుంచి దిగుమ‌తి అయిన వ‌ణ్య‌ప్రాని సంబందిత ప్రొడ‌క్ట్ లు, లోష‌న్లు, క్రీమ్ లు, పౌడ‌ర్ల‌కు దూరంగా ఉండాల‌ని సూచించింది.

Advertisement

Advertisement

మంకీపాక్స్ కేసుల‌ను నిర్ధారించేందుకు 15 వైర‌స్ రీసెర్చ్ అండ్ డ‌యాగ్నోస్టిక్ ల్యాబోరేట‌రీస్ సిద్ధంగా ఉన్న‌ట్టు ఐసీఎంఆర్ వెల్ల‌డించింది. ముఖ్యంగా ఈ వ్యాది సోకిన వారికి జ్వ‌రం, త‌ల‌నొప్పి, న‌డుము నొప్పి, కండ‌రాల నొప్పి, అల‌స‌ట వంటి లక్ష‌ణాల‌తో పాటు ముఖం, చేతులు, కాళ్ల‌పై ద‌ద్దుర్లు, బొబ్బ‌లు ఏర్ప‌డుతాయి. వ్యాదికి గురైన వారిలో చాలా వ‌ర‌కు వారం రోజుల్లోనే కోలుకుంటారు. నూటిలో కొంత‌మందికి మాత్ర‌మే ఈ వ్యాది ప్రాణాంత‌కంగా మారే అవ‌కాశ‌ముంద‌ని డ‌బ్ల్యూహెచ్ఓ వెల్ల‌డించింది.

Also Read :

ఈ పేరు గల అమ్మాయిలు చాలా లక్కీ.. వారు ఏం కోరుకుంటే అది నేర‌వేరుతుంది

వాట్సాప్ యూజ‌ర్ల‌కు శుభ‌వార్త‌.. స్టేట‌స్ లో మ‌రో కొత్త ఫీచ‌ర్..!

Visitors Are Also Reading