Home » పిల్లల జ్ఞాపకశక్తిని పెంచి, బాగా చదువుకునేలా చేసే పదార్ధాలు ఇవే..!

పిల్లల జ్ఞాపకశక్తిని పెంచి, బాగా చదువుకునేలా చేసే పదార్ధాలు ఇవే..!

by Anji
Published: Last Updated on
Ad

చిన్న పిల్లలతో పాటు ఎదిగే చిన్నారులకు ఆరోగ్యంతో పాటు జ్ఞాపకశక్తి చాలా ముఖ్యం. జ్ఞాపకశక్తి బాగా ఉండే పిల్లలే ఆటలు, పాటల్లో చాలా చురుకుగా ఉంటారు. చదువుల్లో కూడా బాగా రాణిస్తారు. ఈ లక్షణాలు మాత్రం పిల్లలందరిలో కనిపించవు.పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచడానికి వైద్యులు ఇచ్చే సూచనలు, మెడిసిన్స్‌ కాకుండా ఇంట్లో మనకు దొరికే పదార్ధాలను వాళ్లకు క్రమం తప్పకుండా ఇస్తే ఫలితం ఉంటుంది. వాటిని తినడం వల్ల చిన్నారుల్లో జ్ఞాపకశక్తి సులువుగా పెరుగుతుంది. ఏయే ఆహార పదార్థాలు తింటే జ్ఞాపక శక్తి పెరుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


పిల్లల్లో జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే పోషక విలువలు కలిగిన ఆహారం ఇవ్వడం వల్ల వారిలోనే మేధాశక్తి బాగా పెరుగుతుంది. పిల్లలకు ఎక్కువగా సాల్మన్ చేపలు పెట్టడం చాలా మంచిది. ఈ సాల్మన్ చేపల్లో ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ అయినటువంటి డీహెచ్ఏ,ఈపీఏ తగినంత ఉంటాయి. బ్రెయిన్ బాగా పని చేస్తుంది. ముఖ్యంగా చాలా మంది పిల్లలకు ప్రోటీన్ లోపం ఉంటుంది. అందువల్లే కోడిగుడ్లలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. పచ్చసొనలో ఉండే కొలిన్ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పిల్లలు ఉదయం స్కూల్ కు వెళ్లే ముందు గుడ్లను బ్రేక్ ఫాస్ట్ గా ఇచ్చి పంపడం బెస్ట్ ఆప్షన్. ఉడికించిన గుడ్డు లేదంటే ఆమ్లెట్ రూపంలో కూడా ఇవ్వవచ్చు.

Advertisement


ముడి ధాన్యాలు కూడా పిల్లల మెదడుకు కావాల్సిన శక్తినిచ్చే పదార్థాలే. పాలిష్డ్ ధాన్యాలతో పోలిస్తే ముడి ధాన్యాల్లో ఉండే ఫైబర్ శరీరం గ్లూకోజు సంగ్రహణను బాగా పెంచుతుంది. నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి ఎంతో దోహపడతాయి. బీన్స్ లో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలకు బీన్స్ తో చేసిన ఆహారాన్ని అందించాలి. ఇతర రకాలతో పోలిస్తే కిడ్నీ, పింటో బీన్స్ లో ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ చాలా ఎక్కువగా లభిస్తాయి.

Advertisement

Also Read :   స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ కవర్‌ యెల్లో కలర్‌లోకి ఎందుకు మారుతుందో తెలుసా ?


టమాటాలు, స్వీట్ పొటాటో, గుమ్మడికాయ, క్యారట్, పాలకూర వంటివన్నీ పిల్లలకు కావాల్సిన ముఖ్యమైన పోషకాలను ఇస్తాయి. వారికి రోజువారీగా బెర్రీలు, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, కత్తిరించిన బాదం గింజలు ఇవ్వాలి. ముఖ్యంగా బీ విటమిన్లు సమద్ధిగా లభించే పాలు, పాల ఉత్పత్తులైన పెరుగు, యుగర్ట్ తప్పకుండా తినిపించడం చాలా ఉత్తమం. వేరు శనగలు, పీనట్ బటర్‌లో విటమిన్ E అనే యాంటీ ఆక్సిడెంట్ లభిస్తుంది. ఇది న్యూరోనల్ మెంబ్రేన్లను కాపాడడంలో ఎంతో సహాయపడుతుంది. దీనికి తోడు పీనట్ లో థయమిన్ లభిస్తుంది. ఇది మెదడు, నెర్వస్ సిస్టమ్ గ్లూకోజును శక్తిగా మార్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

Also Read : ఆరోగ్యం గా ఉండాలంటే రోజుకు ఇన్ని గంటలు నిద్ర పోవాలా ?


అలాగే పిల్లలకు మంచి చేసే ఆహారంలో ఓట్స్ కూడా చాలా ముఖ్యమైనవి. వీటిలో ఉండే ఫైబర్ పిల్లలకు రోజంతా కావాల్సిన శక్తిని క్రమంగా ఇచ్చేవిధంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఓట్స్ లో ఉండే పొటాషియం, జింక్, విటమిన్ E, B విటమిన్స్ వంటివి పిల్లలను షార్ప్ గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Also Read :   పెళ్లయిన తర్వాత స్త్రీలు ఎందుకు లావవుతారు.. అసలు కారణం అదేనా..?

Visitors Are Also Reading