Home » ఒకే ఒక్క డ్రెస్ తో సినిమా అంతా కంప్లీట్! అలాంటి 8 సినిమాలు!

ఒకే ఒక్క డ్రెస్ తో సినిమా అంతా కంప్లీట్! అలాంటి 8 సినిమాలు!

by Azhar
Ad

చిన్న సినిమాకు కూడా కోట్ల‌లో ఖ‌ర్చు పెడుతున్న కాలం. మ‌రీ కాస్ట్యూమ్స్ విష‌యంలో మ‌రింతగా డ‌బ్బులు ధార‌బోస్తుంటారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు! ఒక పాట‌కే ప‌దిప‌దిహేను డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ కాస్ట్యూమ్స్ లో క‌నిపిస్తుంటారు హీరో హీరోయిన్స్! ఇలాంటి స‌మ‌యంలో కేవలం ఒకే డ్రెస్ తో సినిమా మొత్తం కంప్లీట్ చేస్తే…? ఇదిగో ఆ 8 సినిమాలు ఇవే!

సోన్ చిరియా..

Advertisement

సుశాంత్ సింగ్ రాజ్ పూత్ విల‌న్ రోల్ లో క‌నిపించిన ఈ సినిమాలో సుశాంత్, భూమి ఫడ్నేకర్, మనోజ్ బాజ్పేయ్ ల‌తో పాటు ఎంటైర్ కాస్టింగ్ ఒకే కాస్ట్యూమ్ లో క‌నిపిస్తారు .

అ(AWE)
నాని ప్రొడ్యూజ‌ర్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వ‌హించిన ఈ సినిమాలో కూడా రెజీనా,కాజల్, అవసరాల శ్రీనివాస్, మురళీశర్మల‌తో పాటు ఎంటైర్ కాస్టింగ్ కు ఒకే కాస్ట్యూమ్!


మిస్టర్ ఇండియాలో అనీల్ కపూర్

1987లో అనిల్ కపూర్,శ్రీదేవి హీరోహీరోయిన్స్ గా వచ్చిన మిస్టర్ ఇండియా సినిమాలో సినిమా మొత్తం అనిల్ క‌పూర్ ఒకే డ్రెస్ లో క‌నిపిస్తారు.


ఖైదీ – కార్తీ

Advertisement

కార్తీ న‌టించిన ఈ సినిమాలో కూడా హీరో కార్తీది సినిమా మొత్తం ఒక‌టే డ్రెస్ !

చమేలీ –కరీనా కపూర్

కపూర్ ర్యాంప్ పాత్ర పోషించిన ఈ సినిమాలో కూడా క‌రీనాది సినిమా అంతా ఒకటే డ్రెస్

గులాబ్ గ్యాంగ్ – మాధురీ దీక్షిత్
ఈ సినిమాలో మాధురీతో పాటు ఆమె గ్యాంగ్ అంతా గులాబీ చీర‌ల్లోనే క‌నిపిస్తారు. సినిమా మొత్తం ఇదే డ్రెస్!


శంక‌ర్ దాదా MBBS- శ్రీకాంత్
శంక‌ర్ దాదా MBBSలో ATM రోల్ ప్లే చేసిన శ్రీకాంత్ కూడా సినిమా మొత్తం ఒకే కాస్ట్యూమ్ తో ఉంటాడు.

NH10- అనుష్కశర్మ

అనుష్క శర్మ ప్రధాన పాత్రలో వ‌చ్చిన ఈ సినిమాలో కూడా అనుష్క సింగిల్ కాస్ట్యూమ్ లో కనపడుతుంది.

ఒన్స్ అపాన్ ఏ టైం ముంబయ్ లో అజయ్ దేవగన్, థోడా ప్యార్ థోడా మ్యాజిక్ లో రాణిముఖర్జీ కూడా సింగిల్ క్యాస్టూమ్లోనే కనపడతారు..ఇవి కోన్ని ఉదాహరణలు మాత్రమే మీకు ఏమైనా తెలిసిన చిత్రాలు,నటులు ఉంటే కామెంట్ చేయండి..

Visitors Are Also Reading