Home » హను-మాన్ మూవీ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్ వీరే..!

హను-మాన్ మూవీ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్ వీరే..!

by Anji
Ad

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా చేస్తున్న హను మాన్ మూవీ పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ని కూడా చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు మూవీమేకర్స్.ఈ సినిమా సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా నిలవబోతున్న నేపథ్యంలో థియేటర్ల కొరత కూడా బాగానే ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

ఇక హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా స్టార్ హీరో చిరంజీవి  వచ్చి సినిమాపై మరింత క్రేజ్ పెంచారు. అలాగే ప్రశాంత్ వర్మ తేజ కాంబినేషన్లో ఇది రెండో మూవీ.వీరి కాంబినేషన్లో జాంబిరెడ్డి అనే హిట్ మూవీ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇక ప్రశాంత్ వర్మ కల్కి, జాంబిరెడ్డి,అ! వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈయన హనుమాన్ అనే పాన్ ఇండియా మూవీకి దర్శకత్వం వహించారు.ఇక ఈ మూవీ బడ్జెట్ 55 కోట్లు. అయితే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాలో తేజ సజ్జా ని తీసుకునే కంటే ముందే మరో ఇద్దరు స్టార్ హీరోలను కలిశారట. అయితే ఆ ఇద్దరు హీరోలకు కథ నచ్చినప్పటికీ ఇందులో నటించలేదట.

Advertisement

ఇక ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు అల్లు అర్జున్  , నాని..మొదట హను మాన్ కథ తీసుకొని అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లగా ఆయన కథ నచ్చినప్పటికీ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఈ మూవీలో నటించలేదట.ఆ తర్వాత నానిని కలిశారట డైరెక్టర్. అలాగే ఈ సినిమాని సొంత బ్యానర్లో నిర్మిద్దాం అని నాని  కూడా అనుకున్నారట.కానీ బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్ల నాని కష్టం అని చెప్పారట.ఆ తర్వాత మరో హీరో దగ్గరికి వెళ్లడం ఇష్టం లేక తేజ సజ్జాని హీరో గా ఫిక్స్ చేశారట ప్రశాంత్ వర్మ.అలా హను మాన్ మూవీ ఇద్దరు స్టార్ హీరోల చేతులు జారీ చివరికి తేజా సజ్జా  చేతులోకి వచ్చింది.

Visitors Are Also Reading