Home » వాణి జయరాం మృతికి అసలు కారణాలు ఇవే.. వెలుగులోకి కీలక విషయాలు..!

వాణి జయరాం మృతికి అసలు కారణాలు ఇవే.. వెలుగులోకి కీలక విషయాలు..!

by Anji
Ad

సినీ ఇండస్ట్రీలో సౌత్, నార్త్ అని తేడా లేకుండా సింగర్ గా తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకుంది గాయని వాణి జయరాం. తమిళనాడులోని వేలూరికి చెందిన వాణి జయరాం తన గాత్రంతో హిందీ, తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం పలు భాషల్లో ప్రేక్షకులను అలరించారు. తెలుగులో పూజ సినిమాలోని ఎన్నెన్నో జన్మల బంధం పాటతో చాలా ఫేమస్ అయ్యారు వాణి జయరాం. హిందీలో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వాణి జయరాంకి దక్కాల్సిన గుర్తింపు మాత్రం దక్కలేదనే విమర్శలున్నాయి. 

Advertisement

77 ఏళ్ల వయస్సున్న వాణి జయరాం ఫిబ్రవరి 04న  మరణించారు. ఆమె మృతిపై పలు అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రధానంగా ఆమె మరణం సహజ మరణం కాదని.. ఎవరో Ha త్య చేసారనే వార్తలు వినిపించాయి. ఆమె ముఖం మీద గాయాలుండడం వల్ల వదంతులు చాలా ఎక్కువయ్యాయి. వాణి జయరాం కేసును పోలీసులు దర్యాప్తు చేసి ఆమె మరణం పై ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు. సహజంగానే మరణించినట్టు పోలీసులు తేల్చేసారు. ఆమె గదిలో కిందపడినప్పుడు ముఖానికి, తలకు గాయాలు తగలడంతోనే మరణించినట్టు దృవీకరించారు. 

Advertisement

Also Read :  బాలయ్య సినిమాకు కాజల్‌ రెమ్యూనరేషన్‌ ఎంత తీసుకుంటుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

Manam News

ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలను సేకరించి అపార్ట్ మెంట్ లోని సీసీ టీవీలను పరిశీలించి ఆమెది సహజ మరణమే అని దృవీకరించారు. ఒంటరిగా ఉన్న వాణి జయరాం గదిలో కింద పడగానే ఢమ్ అనే శబ్దం విని వెంటనే పని మనిషి వచ్చి తలుపు తీయడానికి ప్రయత్నించగా రాకపోవడంతో తలుపులు బద్ధలు కొట్టి చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అదేవిధంగా బంధువులకు కూడా సమాచారమిచ్చారు. ఇంటిని పోలీసుల అదుపులో ఉంచుకొని ఆధారాలను సేకరించడంతో అనుమానస్పదంగా ఏం కనిపించలేదు. ఆమెను చివరిసారిగా చూసేందుకు అభిమానులు, సినీ ప్రముఖులు భారీగా చేరుకున్నారు. వాణి జయరాం అంతక్రియలు తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.

Also Read :  వెంకటేష్ నువ్వు నాకు నచ్చావు మూవీలో బిగ్ మిస్టేక్.. మీరు గమనించారా..?

Visitors Are Also Reading