Home » బాలయ్య సినిమాకు కాజల్‌ రెమ్యూనరేషన్‌ ఎంత తీసుకుంటుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

బాలయ్య సినిమాకు కాజల్‌ రెమ్యూనరేషన్‌ ఎంత తీసుకుంటుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji

కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల బాలయ్య ‘వీర సింహారెడ్డి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదలైన వీరసింహారెడ్డి చిత్రం రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఈ చిత్రం బాలయ్య సినీ కెరీర్ లోనే ఓ సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సమయంలో బాలయ్య చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. వీర సింహారెడ్డి స్థాయిలోనే బాలకృష్ణ తదుపరి చిత్రం ఉంటుందని అందరూ చాలా నమ్మకంతో ఉన్నారు.

ప్రస్తుతం బాలయ్య- ఎప్ 3 ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ విషయం గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. బాలకృష్ణకు జోడిగా పలువురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో నటిస్తుందని.. ఏకంగా కాజల్ కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు కాజల్ అగర్వాల్ రెమ్యునరేషన్ కోటికి పైగానే ఉండేది. కానీ ప్రస్తుతం ఈమెకు పెళ్లయి ఒక బాబు ఉండడంతో.. సమయంలో ఈమెకు రెమ్యూనరేషన్ కోటికి పైగా అక్కడ ఉంటే మామూలు విషయం కాదు. 

Also Read : తారకరత్నను విదేశాలకు తీసుకెళ్తే ఇదే జరుగుతుందట.. ప్రముఖ జ్యోతిష్యుడి కామెంట్స్ వైరల్..!!

Manam News

ఇక బాలయ్య సినిమాలో నటించే అవకాశం రావడంతో పాటు కోటికి పైగా రెమ్యూనికేషన్ దక్కిందంటే ఆమె కచ్చితంగా బంపర్ ఆఫర్ సొంతం చేసుకున్నట్టే అంటూ సినీ విశ్లేషకులు, తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన అతి త్వరలోనే రానుంది. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి దర్శకుడు అనిల్ రావు పూడి ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నాడు. మరోవైపు వచ్చే సంక్రాంతి లోపు బాలయ్య తన సినిమాను విడుదలv చేయనున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికి చెక్ పడాలంటే దర్శకుడు అనిల్ రావిపూడి ఓ క్లారిటీ ఇస్తే కానీ తెలియదు. 

Also Read :  బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లోకి ఎంట్రీ ఇవ్వనున్న రష్మి గౌతమ్..!

Visitors Are Also Reading