Home » మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్స్ వీళ్లే..!

మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్స్ వీళ్లే..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీకి చాలా మంది వస్తుంటారు. కానీ అందులో సక్సెస్ అయిన వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. కొంత మంది తొలి సినిమాతో సక్సెస్ సాధించి ఆ తరువాత సక్సెస్ సాధించవచ్చు. మరల సాధించకుండా అలాగే ఉండిపోవచ్చు. అసలు సినీ ఇండస్ట్రీలో కూడా ఉండకపోవచ్చు. ఇలా రకరకాలుగా జరుగుతుంటాయి. సినీ ఇండస్ట్రీకి వచ్చిన వారిలో మొదటి సినిమాతోనే సక్సెస్ అయిన కొంత మంది హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

 

ఏం మాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత సూపర్ హిట్ అందుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతుంది.  పెళ్లి, విడాకుల తరువాత కూడా బిజీ హీరోయిన్ గా  మారిపోయింది. ఇటీవల సమంత నటించిన యశోద చిత్రం మంచి విజయం సాధించింది. సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ చిత్రంలో నటిస్తోంది. 

Manam News

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ భామ సాయిపల్లవి నటనతో అందరినీ ఫిదా చేసేసింది. తెలంగాణ యాసతో తెలుగు వాళ్లకి మరింతగా దగ్గర అయింది. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా తొలి సినిమాతోనే హిట్ అందుకుంది. 

Manam News

Advertisement

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ తొలి సినిమాతోనే హిట్ కొట్టేసింది. తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ఇటీవల తెలుగులో పెద్దగా ఆఫర్లు లేని రకుల్ ప్రీత్ సింగ్  హిందీలో పలు సినిమాలలో నటిస్తుంది. అక్కడ కూడా ఆమె నటించిన సినిమాలు ప్రస్తుతం సూపర్ హిట్ కాలేదు. ముందుముందు అవుతాయేమో చూడాలి. 

Also Read :  జురాసిక్ పార్కు దర్శకుడిని కలిసి జక్కన్న ఏమన్నాడో తెలుసా..?

ఆర్.ఎక్స్. 100 సినిమాతో పాయల్ రాజ్ పుత్ కూడా ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసింది. డిస్కోరాజా, వెంకిమామా, తీస్ మార్ ఖాన్ వంటి సినిమాల్లో నటించింది. ఇటీవల మంచు విష్ణు తో కలిసి జిన్నా సినిమాలో కూడా నటించింది పాయల్ రాజ్ పుత్. 

Also Read :  మూడో పెళ్లి పై స్పందించిన జయసుధ…ఆ వ్యక్తి ఎవరో కాదంటూ ఓపెన్ కామెంట్స్…!

తెలుగులో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించినటువంటి ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇక తరువాత మనం సినిమాలో అతిథి పాత్రలో నటించింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. మంచి సక్సెస్ తో దూసుకెళ్తుంది. 

Also Read :   పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్..నాగబాబు బుర్రలేని మనిషి – రోజా

Visitors Are Also Reading