Telugu News » Blog » పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్..నాగబాబు బుర్రలేని మనిషి – రోజా

పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్..నాగబాబు బుర్రలేని మనిషి – రోజా

by Bunty
Ads

గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు మంత్రి రోజా మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు మంత్రి రోజా పరస్పరం మీడియా ముందు వివాదస్పద వ్యాఖ్యలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే, తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్ అని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఆర్కే రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడారు. ‘నాగబాబు మనిషి పెరిగాడే కానీ బుర్ర పెరగలేదు. రాజకీయాల్లో లేని చిరంజీవి పై మాట్లాడను. హీరోగా చిరంజీవిని ఎప్పటికీ అభిమానిస్తా. మెగా ఫ్యామిలీని ఎప్పుడు పర్సనల్ గా విమర్శించలేదు. సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్యకు, బాలకృష్ణ వీరసింహారెడ్డికి కలెక్షన్లు వస్తే, పవన్ కళ్యాణ్ కు మాత్రం చంద్రబాబు నుంచి కలెక్షన్లు అందాయి’ అని సెటైర్లు వేశారు రోజా.

Advertisement

చంద్రబాబు జీవో నెంబర్-1 కాపీలను భోగిమంటలో తగలబెట్టడంపై మంత్రి రోజా మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను చంద్రబాబు మంటల్లో కలిపారని ఫైర్ అయ్యారు. ఈ జీవోను ప్రజల కోసమే తెచ్చామని, చంద్రబాబుకు మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో సక్సెస్ అయిందని చెప్పారు. వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.

Advertisement

READ ALSO : Kalyanam Kamaneeyam Telugu Review : కళ్యాణం కమనీయం రివ్యూ