శ్రీకృష్ణ మహాపరమాత్మ గురించి ఎంత చెప్పిన తక్కువే. ముఖ్యంగా ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన శ్రీకృష్ణావతారం అటువంటి లోకోత్తర గురువైన శ్రీకృష్ణుడి జన్మష్టమి సందర్భంగా తెలుగు తెరపై శ్రీకృష్ణ పాత్రలో అలరించిన హీరోలపై తెలుగు సినిమాల్లో కృష్ణుడి వేషాలు వేసిన వారిలో తొలుత చెప్పుకోవాల్సింది మహానటుడు ఎన్టీఆర్ గురించే.
Advertisement
శ్రీకృష్ణుడు అంటే మనందరికీ ఠక్కున గుర్తుకొచ్చే రూపం రామారావుదే ఆ తరువాత ఎంతో మంది ఆ పాత్రను పోషించిన ఇప్పటికే శ్రీకృష్ణుడు తెలుగు ప్రజలకు ఆ తారక రాముడే గుర్తుకు వస్తాడు. ఈయన దాదాపు 18 చిత్రాల్లో శ్రీకృష్ణ భగవానుడి పాత్రలో మెప్పించారు.
ఎన్టీఆర్, కాంతారావులపై సమకాలీకుడైన ఏఎన్నాఆర్ మాత్రం తన సినీ జీవితంలో ఏసినిమాలో శ్రీకృష్ణుడి పాత్ర వేయలేదు. కానీ గోవుల గోపన్న చిత్రంలో మాత్రం ఒక మాటలో మాత్రం శ్రీకృష్ణుడి వేషంలో కనిపించి ప్రేక్షకులను కనువిందు చేశారు. ఎన్టీఆర్ తరువాత శ్రీకృష్ణుడిగా తెలుగు ఆడియన్స్ ను మెప్పించిన ఘనత కాంతారావుకు దక్కుతుంది. తనదైన శైలిలో ఆ పాత్రకే వన్నె తీసుకొచ్చారు.
బాపు దర్శకత్వంలో వచ్చిన సాక్షి మూవీలో సూపర్ స్టార్ కృష్ణ కాసేపు శ్రీకృష్ణుడిగా కనిపించాడు. చిత్రంలో ఈయన శ్రీకృష్ణుడిగా కనిపించలేదు.
తెలుగు తెరపై శ్రీకృష్ణుడిగా మెప్పించిన హీరోల్లో శోభన్ బాబు ఒకరు. బాపు దర్శకత్వంలో వచ్చిన బుద్ధిమంతుడు సినిమాలో మొదటిసారి శ్రీకృష్ణుడి వేషంలో దర్శనం ఇచ్చాడు శోభన్ బాబు. ఆ తరువాత కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన కురుక్షేత్రం సినిమాలో పూర్తి స్థాయిలో శ్రీకృష్ణ పరమాత్ముడిగా ఆడియన్స్ కి దర్శనమిచ్చాడు.
పాండురంగ మహత్యం సినిమాలో విజయ నిర్మల చిన్ని కృష్ణుడి పాత్రలో నటించింది. అటు ఈమె భూ కైలాస్ చిత్రంలో సీత పాత్రలో నటించడం విశేషం.
దివంగత హీరో నందమూరి హరికృష్ణ శ్రీకృష్ణావతారం సినిమాలో బాలకృష్ణుడిగా వెండితెరకు పరిచయమవ్వడం విశేషం.
దివంగత అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిన శ్రీదేవి యశోద కృష్ణ సినిమాలో బాలకృష్ణుడిగా నటించింది.
Advertisement
యశోద కృష్ణ సినిమాలో పెద్ద శ్రీకృష్ణుడి పాత్రలో నటించిన రామకృష్ణ. ఈయన ఎక్కువ సినిమాల్లో భగవంతుడి పాత్రల్లో మెప్పించడం విశేషం.
శ్రీకృష్ణార్జున విజయం పాండు రంగడులో శ్రీకృష్ణుడిగా నటించిన నందమూరి బాలకృష్ణ అటు పలు చిత్రాల్లో ఈయన కృష్ణుడి పాత్రలో మెప్పించారు.
రేలంగి నరసింహారావు డైరెక్షన్‌లో వచ్చిన కన్నయ్య కిట్టయ్య సినిమాలో రాజేంద్రప్రసాద్ శ్రీకృష్ణుడిగా భక్తుడిగా రెండు పాత్రల్లో నటించి మెప్పించాడు.
అక్కినేని నాగార్జున విష్ణు హీరోగా నటించిన కృష్ణార్జున సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రలో నటించాడు. నెమలి ఇందులో పించం, కిరీటాలు లేకుండా సామాన్యుడిగా కనిపించడం విశేషం.
Also Read : సోషల్ మీడియాలో టాప్ లో ఉన్న మన హీరోలు వీరే…!
ఇప్పటితరం హీరోల్లో గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా కనిపించాడు. ఈయన కూడా సామాన్యుడైన శ్రీకృష్ణుడి వేషంలో కనిపించడ విశేషం.
సూపర్ స్టార్ మహేష్ బాబు యువరాజు సినిమాలో ఒక పాటలో శ్రీకృష్ణుడిగా కనువిందు చేసాడు. ఆ తరువాత మరే చిత్రంలో ఇలాంటి ప్రయత్నం చేయలేదు.
Also Read :
మీ శరీరం, నోటి నుంచి దుర్వాసన వస్తుందా..? ఇలా చేస్తే మటుమాయం..!
సునిల్ అందాల రాముడులో కొంటే శ్రీకృష్ణుడిగా కాసేపు కనిపించడం విశేషం. ఇందులో సరదగా ఉండే శ్రీకృష్ణుడి పాత్రలో కనువిందు చేయడం విశేషం.
అందరూ చిన్నపిల్లలతో తెరకెక్కిన దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు మాస్టర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రలో నటించడం విశేషం.
ఇది కన్నడలో తెరకెక్కిన కురుక్షేత్ర సినిమాలో కన్నడ నటుడు రవిచంద్రన్.. శ్రీకృష్ణుడి పాత్రలో నటించారు. ఈ సినిమాను తెలుగులో కురుక్షేత్రం పేరుతో డబ్ చేసి విడుదల చేశారు.
Also Read :
అభిమాని ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చిన బాలయ్య.. ఆ తరువాత ఏం చేశారంటే..?
తెలంగాణ ప్రాంతం నుండి వచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లుగా ఎదిగిన 5 గురు భామలు వీళ్లే..!