Home » అభిమాని ఇంటికి వెళ్లి స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన బాల‌య్య‌.. ఆ త‌రువాత ఏం చేశారంటే..?

అభిమాని ఇంటికి వెళ్లి స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన బాల‌య్య‌.. ఆ త‌రువాత ఏం చేశారంటే..?

by Anji
Ad

నంద‌మూరి హీరో బాల‌కృష్ణ గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆయ‌న‌లో ముఖ్యంగా రెండు కోణాలు క‌నిపిస్తుంటాయి. ఆయ‌న ఎంత కోపంగా క‌నిపిస్తారో.. అంతే స్థాయిలో ప్రేమ కూడా కురిపిస్తుంటారు. బాల‌కృష్ణ‌కు అభిమానుల ఫాలోయింగ్ బాగానే ఉంది. ప్రస్తుతం అనంత‌పురం జిల్లాలోని సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన హిందూపురంలో ఆయ‌న ప‌ర్య‌టిస్తున్నారు. ఆయ‌న స‌తీమ‌ణితో క‌లిసి వెళ్లారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు మెరుగైన ఉచిత వైద్యం అందించాల‌ని సంక‌ల్పించారు. అంద‌రికీ వైద్య‌సేవ‌లు అందుబాటులో ఉండేవిదంగా ఎన్టీఆర్ ఆరోగ్య ర‌థం పేరుతో త‌యారు చేసిన ప్ర‌త్యేక బ‌స్సును ప్రారంభించారు.


శ్రీ‌స‌త్యసాయి జిల్లా హిందూపురం మండ‌లం చ‌లివెందులలో ఈ ఆరోగ్య ర‌థాన్ని అందుబాటులోకి తెచ్చారు. తాము ప్రారంభించిన మొబైల్ వాహ‌నం ద్వారా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అత్యాదునిక సాంకేతిక ప‌రిజ్క్షానంతో వైద్య సేవ‌లు అందిస్తామ‌ని చెప్పారు. ఎన్టీఆర్ ఆరోగ్య ర‌థం ద్వారా ప్ర‌త్యేక వైద్య బృందం వైద్య ప‌రీక్ష‌లు ఉచిత వైద్యం అందించ‌నుందని తెలిపారు. వాహ‌నంలో ఒక వైద్యుడు, ఒక న‌ర్సు, ఒక ఫార్మాసిస్ట్‌, ఆరుగురు వైద్య సిబ్బంది, మెడిసిన్ కౌంట‌ర్‌, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ ఉంటారు. సాధార‌ణ వ్యాధుల‌కు చికిత్స‌, ఉచితంగా మందులు ఇస్తారు. బాల‌య్య హిందూపురం వ‌చ్చిన రీజ‌న్ వేరైనా అభిమానుల ప‌ట్ల త‌న ప్రేమ ఎలా ఉంటుందో మ‌రోసారి బాల‌య్య చాటుకున్నారు.

Advertisement

Advertisement

హిందూపురం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న ఓ అభిమాని ఇంటికి వెళ్లి స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. అలా అని ఆ అభిమాని టీడీపీ నేత‌నో.. యాక్టివ్ కార్య‌క‌ర్త‌నో కాదు.. క‌నీసం బాల‌య్య ఫ్యాన్ అసోసియేష‌న్ నేత కూడా కాదు. ఒక సాదార‌ణ అభిమాని అత‌ని ఇంటికి వెళ్లారు బాల‌య్య‌. హిందూపురం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న బాల‌య్య‌కు ఇవాళ త‌న అభిమాని పుట్టిన రోజు అని తెలిసింది. వెంట‌నే త‌న‌స్థాయి హోదా అన్ని ప‌క్క‌న పెట్టి త‌న అభిమాని ఇంటికి వెళ్లారు. అత‌నికి ఆశీస్సులు అందించారు. స్వ‌యంగా బాల‌కృష్ణ త‌న ఇంటికి రావ‌డంతో ఇదే అస‌లు పుట్టిన రోజు అంటూ క‌న్నీటి ప‌ర్వంత‌మ‌య్యాడు ఆ అభిమాని. వెంటనే శాలువాతో అభిమాన హీరోను స‌త్క‌రించాడు.

బాల‌య్య అభిమానుల‌పై ప్రేమ చూపించ‌డం ఇది తొలిసారి కాదు.. ఆ మ‌ధ్య క‌ర్నూలులో గోపిచంద్ మ‌లినేని సినిమాకు సంబంధించి బాల‌య్య‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించిన స‌మ‌యంలో మ‌రో అభిమానికి షాకిచ్చారు. ఓ అభిమానికి స్వ‌యంగా తానే ఫోన్ చేశారు. అతని కుటుంబంలో క‌లిసి భోజ‌నం చేశారు. ఇక అభిమాని ఆప్యాయంగా మాట్లాడారు. బాల‌య్య త‌న ప్రేమ చూపించిన ఎన్నో ఘ‌ట‌న‌లున్నాయి. ఆయ‌న అభిమానులు ఎంత ప్రేమిస్తారో అదే స‌మయంలో ఆగ్ర‌హంతో ఊగిపోతుంటారు. ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అటు సోష‌ల్ మీడియాలో ఆ వీడియోలు ట్రోల్ అవుతుంటాయి. బాల‌య్య మంచి మ‌న‌సు గురించి తెలిసిన అభిమానులు మాత్రం అలాంటి చెప్పు దెబ్బ‌లను కూడా ప‌ట్టించుకోకుండా జై బాల‌య్య అంటుంటారు.

Also Read : 

 

హెలికాప్టర్ ప్రమాదానికి ముందు “సౌందర్య” మాట్లాడిన చివరి మాటలు అవేనా ? ఆ రోజు ఏమైందంటే ?

తన సినిమా విడుదల కోసం ఆనాటి “ఇందిరా గాంధీ” ప్రభుత్వానితో ఎందుకు NTR గొడవ పడ్డారు ? అసలు కథ ఇదే !

Visitors Are Also Reading