Home » ఈవారం థియేటర్ / ఓటీటీలో విడుదల కానున్న చిత్రాలు ఇవే..!

ఈవారం థియేటర్ / ఓటీటీలో విడుదల కానున్న చిత్రాలు ఇవే..!

by Anji
Ad

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీ ట్రెండ్ నడుస్తుంది. సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయగా.. ఆ తరువాత చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయగా ఇక ఆ తరువాత చిన్న సినిమాలు కూడా విడుదలయ్యాయి. ఫిబ్రవరి మొదటివారంలోనే పలు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ వారం సినీ ప్రేక్షకులకు కనువిందు చేయనున్న చేయనున్న సినిమాల గురించి చూద్దాం. థియేటర్లతో పాటు ఓటీటీలో రిలీజ్ కి సిద్ధమైన సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మైఖేల్ :

Advertisement

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించింది. విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 03న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

రైటర్ పద్మభూషణ్ :

Manam News

కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో టీనా శిల్పరాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్టర్లు, టీజర్ ఇప్పటికే పాజిటివ్ బజ్ ని క్రియేట్  చేస్తున్నాయి. ఫిబ్రవరి 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Also Read :  60 ఏళ్ల వయసులో కూడా టాలీవుడ్ ను ఏలుతున్న హీరోలు.. ఎవరంటే..?

సువర్ణ సుందరి  :

Manam News

సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా సువర్ణ సుందరి. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎం.ఎల్. లక్ష్మీ నిర్మించారు. డాక్టర్ ఎంవీకే రెడ్డి సమర్పణలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 03న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. 

Advertisement

Also Read :  తమ్ముడు సినిమాలో సెకండ్ హీరోయిన్ మీకు గుర్తుకు ఉందా..? ఇప్పుడు ఎలా మారిందంటే..?

ప్రేమదేశం :

Manam News

 

త్రిగుణ్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం ప్రేమదేశం. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మధుబాల ప్రత్యేక పాత్రలో నటించారు. శిరీష సిద్ధమ్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 03న విడుదల కాబోతుంది. 

బుట్టబొమ్మ :

Manam News

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో అవార్డులు అందుకున్న అనిఖా సురేంద్రన్ తెలుగులో హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం బుట్టబొమ్మ. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 04న థియేటర్లలో సందడి చేయబోతుంది. 

Also Read :   ‘స్పై’ నుంచి అఫీషియల్ లీక్ ఇచ్చిన నిఖిల్..!

నెట్ ఫ్లిక్స్ 

  • పమీలా (హాలీవుడ్ ) జనవరి  31 
  • గంతర్స్ మిలియన్స్ (వెబ్ సిరీస్ ) ఫిబ్రవరి 01 
  • క్లాస్ ( వెబ్ సిరీస్ సీజన్ 1) ఫిబ్రవరి 3
  • ట్రూ స్పిరిట్ ఫిబ్రవరి 3
  • ఇన్ ఫయిస్టో ( హాలీవుడ్) ఫిబ్రవరి 3
  • స్ట్రామ్ బాయిల్ ఫిబ్రవరి 3
  • వైకింగ్ ఊల్ప్ ఫిబ్రవరి 3

డిస్నీ + హాట్ స్టార్ : 

  • బ్లాక్ పాంథర్ వాఖండా ఫరెవర్ (హాలీవుడ్) ఫిబ్రవరి 1
  • సెంబి ( తమిళం) ఫిబ్రవరి 3

సోనీలివ్

  • జహనాబాద్ ఆఫ్ లవ్ అండ్ వార్ ( హిందీ) ఫిబ్రవరి 3

Also Read :  ఆ అలవాటు వల్లే తారకరత్న కు గుండెపోటు వచ్చిందా…? షాకింగ్ విషయాలు బయటపెట్టిన నిర్మాత…!

Visitors Are Also Reading