Home » 60 ఏళ్ల వయసులో కూడా టాలీవుడ్ ను ఏలుతున్న హీరోలు.. ఎవరంటే..?

60 ఏళ్ల వయసులో కూడా టాలీవుడ్ ను ఏలుతున్న హీరోలు.. ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీ అంటేనే కత్తి మీద సాము లాంటిది. ఇండస్ట్రీలో రాణించాలి అంటే నటన టాలెంట్ అధికంగా ఉండాలి. అంతేకాకుండా కాస్త లక్ కలిసి రావాలి. అలాంటి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే జనరేషన్ కు తగ్గట్టుగా మార్పులు చేసుకుంటూ ఉండాలి. అలా ఇండస్ట్రీలో దాదాపుగా దశాబ్దాల పాటు కొనసాగుతూ ఇప్పటికీ యువ హీరోల కు పోటీ ఇస్తూ 60 ఏళ్ల వయసులో కూడా మేమేం తక్కువ కాదంటున్న హీరోలు చాలామంది ఉన్నారు.. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి ఈయనకు 65 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసుకోకుండా సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్నారు..

Advertisement

దశాబ్ద కాలం పాటు రాజకీయాల్లో కొనసాగి బాస్ ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్ తో ఖైదీ నెంబర్ 150 మూవీతో మళ్లీ ఎంట్రీ ఇచ్చి అదే జోష్ తో కొనసాగుతున్నారు.. తాజాగా ఆయన వాల్తేరు వీరయ్య మూవీ సూపర్ హిట్ కొట్టింది.. ఇక మెగాస్టార్ చిరంజీవి తర్వాత చెప్పుకోదగ్గ హీరో నందమూరి బాలయ్య.. 60 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా పవర్ ఫుల్ డైలాగ్స్, నటన తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్లో చాలా హిట్స్ అందుకున్న బాలయ్య తాజాగా రిలీజ్ అయిన వీర సింహారెడ్డి మూవీతో సూపర్ హిట్ కొట్టారు. ఇక మరో చెప్పుకోదగ్గ హీరో కింగ్ నాగార్జున.

Advertisement

60 ఏళ్లు పూర్తయిన కానీ తన కొడుకుల కంటే ఎక్కువ ఎనర్జిటిక్ గా కనిపిస్తూ ఉంటారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నారు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ హీరో విక్టరీ వెంకటేష్ , ఓవైపు క్లాసు,మరోవైపు మాస్, ఇంకోవైపు కామెడీ సినిమాలు చేస్తూ అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు హీరో వెంకటేష్. ఈ విధంగా ఇండస్ట్రీలో 60 ఏళ్లు దాటినా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ హీరోలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

also read:

Visitors Are Also Reading