Home » ఆధార్ కార్డు విషయంలో ప్రభుత్వం విధించిన షరతులు ఇవే..!

ఆధార్ కార్డు విషయంలో ప్రభుత్వం విధించిన షరతులు ఇవే..!

by Anji
Ad

ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా ఇండియాలోని ప్రజలందరికీ ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారింది. ప్రస్తుత రోజుల్లో గవర్నమెంట్ పథకాలకు ఇలా ప్రతి ఒక్కదానికి ఆధార్ తప్పనిసరి అవసరం. ముఖ్యమైన డాక్యుమెంట్ లో తప్పులు ఉంటే చేసుకోవడం అనేది తప్పనిసరి. అయితే ఆధార్ కార్డులో పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇంటిపేరు, అడ్రస్, జెండర్ లాంటి వాటిలో తప్పులు ఉన్నట్లయితే.. ఆధార్ కార్డు లోని డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ను మాత్రం ఒకసారి మాత్రమే మార్చుకోవాలని తాజాగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని పరిమితులు, షరతులను విధించింది.

Advertisement


ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీని ఎక్కువసార్లు మార్చుకోవడానికి వీలు లేదు. ఆధార్ కార్డ్ హోల్డర్ తన జీవితం కాలంలో కేవలం రెండుసార్లు మాత్రమే తన పేరును మార్చుకునే అవకాశం ఉంటుంది. పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే అప్ డేట్ చేసుకోవాలి. జెండర్ మార్చు కోవాలంటే ఒకసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పరిమితికి మించి పేరు, డేట్ అఫ్ బర్త్, జెండర్ అప్ డేట్ చేసుకోవాలనుకుంటే ప్రత్యేక రిక్వెస్ట్ పెట్టాలి. అలాగే ఆధార్ కార్డు సమస్యల పరిష్కారం కోసం UIDAI.. 1947 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో తీసుకొచ్చింది.

Advertisement


ఈ నెంబర్ కు కాల్ చేస్తే ఎలాంటి చార్జీలు  ఉండవు. ఉర్దూ, తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, అస్సామీ, ఒరియా, మరాఠీ మొత్తం 12 భాషల్లో UIDAI ప్రతినిధులు మీకు అందుబాటులో ఉంటారు. మీ సేవలో సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, అదే విధంగా ఆదివారం రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading