Home » టాలీవుడ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన సెలెబ్రిటీలు వీరే..!

టాలీవుడ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన సెలెబ్రిటీలు వీరే..!

by Anji
Ad

డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా పెద్ద తప్పు అనే చెప్పాలి. మద్యం సేవించి రోడ్డుపై రాష్ డ్రైవింగ్ చేసి ఎంతో మంది ఫ్యామీలను ఇబ్బంది పెట్టడం ఒకరకంగా నేరం అనే చెప్పవచ్చు. ఈ తప్పుని ఎవరు చేసినా తప్పే. సమాజంలో మంచి గుర్తింపు ఉన్నవాళ్లు కూడా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ చాలామంది దానిని పట్టించుకోరు. ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేసి కొందరు ప్రాణాలు కోల్పేతే మరికొందరు పక్కన ఉన్న వారి ప్రాణాలు తీయడంలో లేక యాక్సిడెంట్ చేసి వారిని ఇబ్బంది పెట్టడమో ఇలా తరుచూ జరుగుతూనే ఉన్న విషయం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.ఇక వారిలో కొంతమంది సినీ నటులు కూడా ఉన్నారు. మన తెలుగులో చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన నటులు చాలా మంది ఉన్నారు. వారు ఎవరెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నవదీప్ 

Advertisement

టాలీవుడ్ లో నవదీప్ కు మంచి పేరుంది. ఒకసారి ఇతను పార్టీకి వెళ్తున్న సమయంలో పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికాడు. మద్యం సేవించి డ్రైవ్ చేసిన నవదీప్ వద్ద నుంచి వాహనాన్ని స్వాధీనం చేసుకుని జరిమానా వస్తువులు చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.

నిఖిల్

యూత్ లో ప్రస్తుతం మంచి కేజీ ఉన్న హీరోలలో యువ హీరో నిఖిల్ ఒకరు. తాగి డ్రైవ్ చేస్తూ 2011లో పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. పోలీసుల ఇతనికే కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ సమయంలో ఒకరోజు రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. ఇక తరువాత జాగ్రత్త పడ్డాడు.

Also Read :  ర‌జినీకాంత్ కి ‘కాంతార’ హీరో పాదాభివంద‌నం.. ట్వీట్ పోస్ట్‌..!

శివ బాలాజీ

ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గరైన నటుడు శివ బాలాజీ. ఇతను కూడా ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయాడు. 2012లో అతను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దొరికాడు. ఆ సమయంలో మీడియాపై అతను ఫైర్ అయ్యాడు. మీడియా వేసే ప్రశ్నలకు ఇబ్బంది పడిన అతను అసహనం వ్యక్తం చేశాడు.

Advertisement

భరత్ 

రవితేజ సోదరుల్లో భరత్ ఒకడు. ఏదో ఒక వివాదంలో కనిపిస్తూనే ఉంటాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ద్ర గ్స్ , ఆల్కహాల్ వంటి వ్యవహారాల్లో ఇతని పేరు చాలా ఎక్కువగా వినిపించింది. పలు సందర్భాల్లో పోలీసులకు చిక్కాడు. ఇతని వల్ల అన్న రవితేజ పరువు పోతుందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read :  రెండో పెళ్లి గురించి న‌టుడు బ‌బ్లూ పృథ్విరాజ్ ఏమన్నారంటే ?

కొన వెంకట్


ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ కూడా కేసులో పోలీసులకు పట్టబడ్డారు. తర్వాత కౌన్సిలింగ్ కి వెళ్ళాడు. తరచూ వార్తలు వినిపిస్తున్నాయి.

బీవీఎస్ రవి

రచయిత దర్శకుడు రవి.. ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు. అతను సాధారణ స్థితికి వచ్చి సోషల్ మీడియాలో గురించి అవగాహన కల్పిస్తున్నారు.

రాజా రవీంద్ర

ఒకప్పుడు హీరోగా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన రాజా రవీంద్ర ఒకసారి సూటుగా మద్యం సేవించి కోర్టుకు వెళ్లారు. ఇక ఆ తర్వాత దూరంగా ఉన్నారు.

Also Read :  Jr..ఎన్టీఆర్ ఎంత మంచి వారంటే..సీక్రెట్ గా తారకరత్నకు నెలకు ఎంత ఇస్తాడో తెలుసా..?

ప్రదీప్ మాచిరాజు

యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు.  కేవలం వీరు మాత్రమే కాదు.. ఇంకా చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడడం విశేషం.

Also Read :   టాలీవుడ్ టాప్ హీరోల్లో ఎవరు ఎక్కువ కట్నం తీసుకున్నారో తెలుసా ?

 

Visitors Are Also Reading