కన్నడంలో కేజీఎఫ్ సినిమా తరువాత మళ్లీ ఆ స్థాయిలో విజయం సాధించిన చిత్రం ఏదైనా ఉందంటే అది కాంతార అనే చెప్పాలి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కాంతార చిత్రం గురించి చర్చించుకోవడం విశేషం. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన ఈ చిత్రం అక్కడ భారీ విజయం సాధించింది. దీంతో ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం ఇలా వరుసగా అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఇక టాలీవుడ్ లో అక్టోబర్ 17న అయితే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసింది కాంతార.
Advertisement
ఈ సినిమాపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే స్వయంగా రిషబ్ ని కలసి అభినందించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అంతేకాదు తెలిసినది గోరంత తెలియనిది కొండంత.. ఈ విషయాన్ని సినిమాలో మీకంటే బాగా ఎవరూ చెప్పలేరు అని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ను కొనియాడారు.
Advertisement
Also Read : ఎన్టీఆర్ కెరీర్ ను మలుపుతిప్పిన 5 సినిమాలు…అవి క్రియేట్ చేసిన రికార్డులు ఇవే..!
రజనీకాంత్ తన సినిమా చూసి ఆనందించడం పట్ల రిషబ్ స్పందించారు. తాజాగా ట్విట్టర్ లో ఆయన ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. మీరు ఒక్కసారి మెచ్చుకుంటే వందసార్లు మెచ్చుకున్నట్లే. ధన్యవాదాలు రజిని సార్. మా కాంతార చూసినందుకు చాలా సంతోషంగా ఉంది అని ట్వీట్ చేస్తూ రజినీకాంత్ కి పాదాభివందనం చేస్తూ ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోలను షేర్ చేశాడు.
Advertisement
Also Read : జయలలిత పెళ్లి చేసుకోమని అడిగితే శోభన్ బాబు సమాధానం ఇదేనట..? అలా ఎందుకు చెప్పారంటే..?