తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గౌరవ హోదా ఉంది.. ఆయన ఇండస్ట్రీలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమంది నందమూరి ఫ్యామిలీని ఆరాధించేవారు ఉన్నారు. ఎందుకంటే నట సార్వభౌమ ఎన్టీఆర్ అప్పట్లో సినిమాలు మరియు రాజకీయాల ద్వారా ఎంతో మంది ప్రజలకు ఆపద్బాంధవుడు అయ్యారు. అందువల్ల వారి ఫ్యామిలీ అంటే ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది.. ఆయన నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని బాలకృష్ణ, ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.. కట్ చేస్తే నందమూరి తారకరత్న ఇండస్ట్రీలోకి వచ్చి రాగానే ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా చేయగానే ఏకంగా తొమ్మిది సినిమాలను లైన్లో పెట్టారు.
Advertisement
also read;జపాన్ లో ఆర్ఆర్ఆర్ అరుదైన ఫిట్..!
Advertisement
ఆయన ఎంత ఫాస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చారో అంతే ఫాస్ట్ గా ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు. ఒకటో నెంబర్ కుర్రాడు ఓ మోస్తారు అనిపించినా ఆ తర్వాత వరస ఫ్లాప్స్ వచ్చాయి. దీని తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి సినిమాలో విలన్ గా చేశారు. విలన్ నటనకు నంది అవార్డు కూడా వచ్చింది. కానీ ఈ సినిమా తర్వాత తారకరత్నకు వచ్చిన ఆఫర్స్ అయితే లేవు. ఈ తరుణంలోనే ప్రేమించి పెళ్లి చేసుకుని నందమూరి ఫ్యామిలీకి దూరమయ్యాడు. తనకు వచ్చే ఆస్తిపాస్తులు ఏవి తీసుకోకుండా సపరేట్ గా ఉంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారట.
ఫైనాన్షియల్ గా అనేక సమస్యలు రావడంతో, కనీసం పిల్లల అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితికి వచ్చాడని జూనియర్ ఎన్టీఆర్ కు తెలిసిందట. ఈ తరుణంలోనే అన్నకు జూనియర్ ఎన్టీఆర్ సాయం చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ సీక్రెట్ గా తారకరత్నకు నెలకి నాలుగు లక్షలకు పైగానే అమౌంట్ పంపిస్తున్నారట. అయితే ఒక సందర్భంలో తారక్ రత్న మాట్లాడుతూ ఈరోజు మా కుటుంబంలో ఎన్టీఆర్ లేకపోతే చాలా ఘోరంగా ఉండేదని, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్న నాకు, తమ్ముడు అండగా నిలిచాడని ఓ సందర్భంలో ఆయన ఎమోషనల్ అయ్యారట.
Advertisement
also read;