Home » టాలీవుడ్ టాప్ హీరోల్లో ఎవరు ఎక్కువ కట్నం తీసుకున్నారో తెలుసా ?

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఎవరు ఎక్కువ కట్నం తీసుకున్నారో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా పెళ్లికి వరకట్నం తీసుకోవడం ఒక నేరం. కానీ దానిని ఆచరించేవారు చాలా తక్కువ మందే ఉన్నారు. ఏ రంగం వారైనా ఎంత కట్నం తీసుకున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప.. వరకట్నం వద్దు అనేవారు లేనే లేరు. డబ్బున్న వారు పేదవారు వారు వీరు అనే తేడా లేకుండా స్తోమతను బట్టి వరకట్నం ఇస్తూనే ఉన్నారు. టాలీవుడ్ హీరోలు కూడా భారీగానే రత్నాలు పుచ్చుకొని పెళ్లిళ్లు చేసుకున్నారు. ఏ హీరో ఎంత కట్నం తీసుకున్నాను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి 

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డిలది లవ్ మ్యారేజ్. అయినప్పటికీ కట్నం బాగానే ఇచ్చినట్టు తెలుస్తోంది. 2011లో వీరి వివాహము జరిగింది. అల్లు అర్జున్ మామ దాదాపు 100 కోట్ల విలువచేసే ఆస్తి ఇచ్చినట్టు సమాచారం. ఇక వీరి పెళ్లికి రూ.10 కోట్ల వరకు ఖర్చు చేశారు.

రామ్ చరణ్ – ఉపాసన 

ఉపాసన జంట 2012 లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి దాదాపు 15 కోట్లకు పైగా ఖర్చు చేశారు. రామ్ చరణ్ కు ఉపాసన కుటుంబం సుమారు రూ.300 కోట్లు వరకట్నం ఇచ్చినట్టు సమాచారం. ఈ దంపతులకు పెళ్లి 10 సంవత్సరాల అవుతున్నప్పటికీ సంతానం కలగకపోవడంతో పలు విమర్శలు ఎదుర్కోవడం విశేషం.

ఎన్టీఆర్ – లక్ష్మీప్రణతి

యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి దాదాపు రూ. 18 కోట్లు ఖర్చు చేశారు. ఎన్టీఆర్ కు కట్నంగా రూ. 200 కోట్ల వరకు ఆస్తులు ఇచ్చారట.

మహేష్ బాబు – నమ్రత

వంశీ చిత్రం సమయంలో మహేష్ నమ్రత ప్రేమలో పడ్డారు. మహారాష్ట్రకు చెందిన నమ్రత మహేష్ను పెళ్లి చేసుకున్నప్పుడు భారీ స్థాయిలోనే ఆస్తులు ఇచ్చారట. 2005 లో ఆ ఆస్తుల విలువ రూ. 75 కోట్లు.. అంటే ఇప్పుడు సుమారు 300 కోట్లకి పైగానే ఉందని చెప్పవచ్చు. వీరి పెళ్లి చాలా సింపుల్ గా చేశారట.

Advertisement

నాని – అంజనా

నేచురల్ స్టార్ నాని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అంజనా అనే అమ్మాయిని దాదాపు మూడేళ్ల పాటు ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లికి రూ.35 లక్షల వరకు ఖర్చు చేశారట. నానికి కట్నం గా రూ. 3 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది.

కళ్యాణ్ రామ్ – స్వాతి

నందమూరి కళ్యాణ్ రామ్ 2006 లో స్వాతిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతుల పెళ్లికి రూ. కోటి వరకు ఖర్చు చేశారు. కళ్యాణ్ రామ్ కు కట్నం కింద దాదాపు రూ. 30 కోట్ల వరకు ఇచ్చినట్టు సమాచారం.

Also Read :  “కాంతారా”లో పంజర్లి దేవత ఎవరు..ఆ ఆచారం ఎలా వచ్చిందంటే..?

గోపీచంద్ – రేష్మ

టాలీవుడ్ హీరో గోపీచంద్ హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మను పెళ్లి చేసుకున్న విషయము అందరికీ తెలిసిందే. గోపీచంద్ పెళ్లికి రూ.1.5 కోట్లు ఖర్చు చేశారట. గోపీచంద్ కు వరకట్నం కింద రూ. 8 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది.

నరేష్ – విరూప

అల్లరి నరేష్ పెళ్లి 2015లో విరూపతో జరిగింది. ఈ పెళ్లికి కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. నరేష్ కు కట్నం గా దాదాపు రూ. 5 ఓట్లు ఇచ్చినట్టు సమాచారం.

Also Read :  సుధీర్ కి వింత గిఫ్ట్ ఇచ్చిన సాయిపల్లవి.. వారి మధ్య ఉంది అదేనా..?

ఆది- అరుణ

సాయికుమార్ కుమారుడు హీరో ఆదితో అరుణ ప్రేమ వివాహం జరిగింది. వీరి పెళ్లికి దాదాపు రూ. 70 లక్షలు ఖర్చు చేశారు. అరుణ కుటుంబం ఆదికి రూ. రెండు కోట్ల వరకు కట్నం ఇచ్చినట్టు సమాచారం. కేవలం ఈ హీరోలు మాత్రమే కాదు.. ఇంకా చాలామంది హీరోలు కూడా వరకట్నం బాగానే తీసుకున్నట్టు తెలుస్తోంది.

Also Read :  రెండో పెళ్లి గురించి న‌టుడు బ‌బ్లూ పృథ్విరాజ్ ఏమన్నారంటే ?

Visitors Are Also Reading