ఐపీఎల్ 16వ సీజన్ లో రోజు రోజుకు మ్యాచ్ లు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు టోర్నీలో చాలా మంది బౌలర్లు, బ్యాట్స్ మెన్ అద్భుతమైన ఫామ్ లో కనిపించారు. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. టోర్నీలో ఇప్పటివరకు సిరాజ్ 5 మ్యాచ్ లలో మొత్తం 20 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అతను 69 బంతులు అంటే.. 10.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. సిరాజ్ ఇప్పటివరకు 50 శాతానికి పైగా డాట్ బాల్స్ వేయడం విశేషం.
Also Read : విరాట్ అంకుల్… వమికాను డేట్ కు తీసుకెళ్లొచ్చా… బుడ్డోడి ప్లకార్డు వైరల్
Advertisement
ఇప్పటివరకు డాట్స్ బాల్ తో పాటు 8 వికెట్లను కూడా తీశాడు. సిరాజ్ 7 ఎకానమీతో పరుగులు వెచ్చించి 17.50 సగటుతో వికెట్లు తీసాడు. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ కి చెందిన మహ్మద్ షమీ అత్యధికంగా డాట్ బాల్స్ విసరే విషయంలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడి మొత్తం 20 ఓవర్లలో 65 డాట్ బాల్స్ విసిరాడు. ఈ సమయంలో షమీ తన పేరిట 10 వికెట్లను కూడా తీశాడు.
Advertisement
Also Read : IPL 2023 : గాయమైనా.. జట్టు కోసం పోరాడిన RCB కెప్టెన్
వీరిలో మహ్మద్ సిరాజ్ (ఆర్సీబీ ) 20 ఓవర్లలో 69 డాట్ బాల్స్, 8 వికెట్లు. మహ్మద్ షమీ (గుజరాత్ టైటాన్స్) 20 ఓవర్లలో 65 డాట్ బాల్స్, 10 వికెట్లు తీయగా.. మార్క్ వుడ్ (లక్నో సూపర్ జెయింట్స్ ) 16 ఓవర్లలో 10 వికెట్లు, అల్జారీ జోసెఫ్ (గుజరాత్ టైటాన్స్) 48 డాల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లను తీశాడు. అదేవిధంగా అర్ష్ దీప్ సింగ్ (పంజాబ్ కింగ్స్ ) 45 డాట్ బాల్స్ 17 ఓవర్లలో 8 వికెట్లు తీశాడు. 2017లో ఐపీఎల్ లోకి ఆరంగేట్రం చేసిన మహ్మద్ సిరాజ్ అప్పటి నుంచి టోర్నీలలో మొత్తం 70 మ్యాచ్ లు ఆడాడు. ఈ మ్యాచ్ లో బౌలింగ్ చేస్తూ.. 31.21 సగటుతో మొత్తం 67 వికెట్లు తీశాడు. ఈ సమయంలో సిరాజ్ ఎకానమీ రేటు 8.63గా ఉంది.
Also Read : కోహ్లీకి దెబ్బ మీద దెబ్బ! భారీ షాక్ ఇచ్చిన BCCI