సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి వంటి వ్యవహారాలు అనేవి సర్వసాధారణం. బాలీవుడ్ తారలు టీవీ స్టార్ల ప్రేమ ఫలించి పెళ్లి బంధంతో ఒక్కటవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అవి బెడిసి కొట్టడం కూడా జరుగుతుంటుంది. సల్మాన్ ఖాన్ నుంచి అక్షయ్ కుమార్ వరకు.. త్రిష నుంచి కరిష్మా తన్నా వరకు నిశ్చితార్థం చేసుకుని బ్రేకప్ అయిన పలువురు ప్రముఖులు ఉన్నారు. అయితే వారి బంధానికి అనూహ్యంగా బ్రేక్ పడడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. నిశ్చితార్థం జరిగిన తరువాత బ్రేకప్ అయిన వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
సల్మాన్ ఖాన్ :
బాలీవుడ్ కండల వీరుడు హీరో సల్మాన్ ఖాన్ సంగీతా బిజ్లానీతో చాలా కాలం పాటు ప్రేమ కొనసాగించాడు. వీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఏమైందో ఏమో కానీ వీరిద్దరూ తమ నిశ్చితార్థాన్ని విరమించుకున్నారు. ఇప్పటికీ స్నేహపూర్వకంగానే ఉన్నారు. ఇక అప్పటి నుంచి సల్మాన్ మళ్లీ పెళ్లి గురించి మాట్లాడలేదు. ఐశ్వర్యరాయ్, కత్రినాకైఫ్, సోమి అలీ-లులియా వాంటూర్-జాక్విలిన్ సహ పలువురితో అతను ప్రేమాయణాలు సాగించాడు. ఐశ్వర్యరాయ్ తో సల్మాన్ వివాహానికి ఛాన్స్ ఉందని భావించినప్పటికీ గొడవలతో విడిపోయారు. ఆ తరువాత ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకుంది.
అక్షయ్ కుమార్ :
మరో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హీరోయిన్ రవీనా టాండన్ ని పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడు. బంధు మిత్రుల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ అతడితో సెటిల్ అవ్వాలని భావించిన రవీనా ఏకంగా అతని కసం బాలీవుడ్ నుంచి తప్పుకోవడానికి సిద్ధమైంది. వీరిద్దరూ గొడవలతో విడిపోయి ఎంగేజ్ మెంట్ ని బ్రేక్ చేసుకున్నారు. ఇక ఆ తరువాాత మరో హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాను పెళ్లి చేసుకున్నాడు అక్షయ్ కుమార్.
అభిషేక్ బచ్చన్ :
అందాల తార కరిష్మా కపూర్ తో ఆరేళ్ల పాటు డేటింగ్ చేశాడు అభిషేక్ బచ్చన్. ఈ జంట సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నారు. అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్ ఇద్దరి సంబంధంతో సంతోషంగా లేరని.. దీంతో పెళ్లిని విరమించుకున్నారని కథలు వినిపించాయి. కరిష్మా ఎప్పుడూ అభిషేక్ బచ్చన్ తో ఘర్షణ పడుతూ కనిపించేదని ఓ ప్రముఖ నిర్మాత కూడా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వీరి బంధం బలహీనంగా ఉండడంతో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ పెళ్లితో ఒక్కటయ్యారు.
Advertisement
సాజిద్ ఖాన్ :
బిగ్ బాస్ 16 కంటెస్టెంట్ సాజిద్ ఖాన్ నటి కం మోడల్ గౌహర్ ఖాన్ ని ప్రేమించాడు. వీరు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని ప్రచారం కూడా జరిగింది. వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖుడిగా సాజిద్ పేరు మారు మ్రోగుతుంది.
నీల్ నిత్ ముఖేష్ :
మరో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ డిజైనర్ ప్రియాంక భాటియాతో నిశ్చితార్థం చేసుకున్నాడు. తమ ప్రేమాయణంపై బహిరంగంగానే అంగీకరించుకున్నారు. పెళ్లికి సిద్ధమయ్యారు. ఇక ఆ తరువాత వీరు తమ బంధాన్నిబ్రేకప్ చేసుకున్నారు.
Also Read : 1991-92 కృష్ణ జీవితంలో చీకటి రోజులు..నిర్మాతలు చూసి ముఖం చాటేసేవాళ్ళు.. కృష్ణను గట్టెక్కించిన మూవీ ఇదే..!!
త్రిష :
సౌత్ కథానాయిక త్రిష బిజినెస్ మేక్ కం తమిళ నిర్మాత వరుణ్ మణియన్ ని పెళ్లాడేందుకు సిద్ధమైంది. నిశ్చితార్థం కూడా పూర్తయింది. కానీ ఆ తరువాత రకరకాల కారణాలతో బ్రేకప్ అయింది. పెళ్లి క్యాన్సిల్ అయిన తరువాత త్రిష మళ్లీ పెళ్లి మాటెత్తలేదు. కెరీర్ పరంగా ఇప్పటికీ బిజీగానే ఉంది.
కరిష్మా తన్నా :
సల్మాన్ ఖాన్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8లో కరిష్మా తన్నా ని నటుడు ఉపేన్ పటేల్ కలిశారు. వారు రియాలిటీ షోలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు గ్రాండ్ ప్లాన్స్ చేసుకున్నారు. ఆ తరువాత వారికి ఏది అనుకూలంగా లేకపోవడంతో విడిపోయారు.
Also Read : శ్రీదేవి చనిపోయే 4 నెలల ముందు బోనీకపూర్ తో మాటల్లేవ్..ఆ 200 కోట్ల కోసమేనా..?