Home » 1991-92 కృష్ణ జీవితంలో చీకటి రోజులు..నిర్మాతలు చూసి ముఖం చాటేసేవాళ్ళు.. కృష్ణను గట్టెక్కించిన మూవీ ఇదే..!!

1991-92 కృష్ణ జీవితంలో చీకటి రోజులు..నిర్మాతలు చూసి ముఖం చాటేసేవాళ్ళు.. కృష్ణను గట్టెక్కించిన మూవీ ఇదే..!!

by Sravanthi Pandrala Pandrala

తెలుగు ఇండస్ట్రీలో అలనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, వంటి స్టార్ హీరోలలో ఒకరైన కృష్ణ ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మారారు. వీరందరి నటన ఒక తీరు ఉంటే కృష్ణ నటన మాత్రం ప్రతి సినిమాలో ఏదో ఒక వెరైటీ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే వచ్చారు. అలాంటి సూపర్ స్టార్ సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పుకోవడం బాధాకరం. ఈ స్టార్ హీరో జీవితంలో కూడా అనేక చీకటి రోజులు ఉన్నాయి. ఎంత టాలెంట్ ఉన్న కొన్ని సమయాల్లో ఆ టాలెంట్ పనికిరాదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కృష్ణ సముద్రానికి ఎదురీదినట్టు ఎంతో కష్టపడి మళ్లీ పైపైకి ఎదిగారు.. మరి కృష్ణ జీవితంలో వచ్చిన గడ్డు రోజులు ఏంటో ఇప్పుడు చూద్దాం.. 1972 కృష్ణ ఒకే సంవత్సరంలో 18 సినిమాలు చేశారు..

also read:20 ఏళ్ల రికార్డును చెరిపేసిన వార్నర్.. 1043 రోజుల తరువాత సెంచరీ..

రోజుకు మూడు షిఫ్టుల చొప్పున ప్రతిక్షణం సినిమా సినిమా అంటూ పని పైన అతని ధ్యాస పెట్టేవారు. ఈ విధంగా ఒక రికార్డునే సాధించారని చెప్పవచ్చు. ఇలాంటి టాలెంటు ఉన్న కృష్ణను 1991- 1992 సమయంలో దర్శక నిర్మాతలు చూస్తేనే ముఖం చాటేసే వాళ్ళట. కృష్ణను చూస్తూ మాట్లాడకుండా దాటి వెళ్లేవారట.. కానీ అప్పటికే కృష్ణకు ఇండస్ట్రీలో సక్సెస్ కల్చర్, ఫెయిల్యూర్ కల్చర్ గురించి తెలుసు.. సక్సెస్ఫుల్ గా ఉంటేనే మన వైపు అందరూ చూస్తారు. లేదంటే పట్టించుకునే నాధుడు ఉండరు. ఆ విధంగానే కృష్ణకు అవకాశాలు లేక ఖాళీగా ఉన్నారు. మంచి అవకాశం కోసం అసహనంగా ఎదురుచూస్తున్నాడు.

 

ఇంతలోనే తుమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో వచ్చిన “పచ్చటీ సంసారం” కం బ్యాక్ ఇచ్చింది. ఇది కాస్త హిట్ కొట్టడంతో కృష్ణకు మళ్లీ దర్శక నిర్మాతల నుంచి ఫోన్లు వచ్చాయి. ఆ తర్వాత బిజీ అయిపోయాడు. ఇంతలోనే అల్లూరి సీతారామరాజు పాత్ర చేశాక, కృష్ణ ఇండస్ట్రీలోనే మల్టీ టాలెంటెడ్ హీరోగా, సీతారామరాజు పాత్ర ఆయన కోసమే పుట్టినట్టుగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక అప్పటి నుంచి హిట్లు, ప్లాపులు అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్లారు. ఈ తరుణంలోనే మోసగాళ్లకు మోసగాడు, సింహాసనం,వంటి సినిమాలు చేసి హిట్ బాట పట్టాడు.

also read:

Visitors Are Also Reading