Home » ఆ తప్పు చేసి కోట్లు నష్టపోయిన మోహన్ లాల్, వెంకటేష్…!

ఆ తప్పు చేసి కోట్లు నష్టపోయిన మోహన్ లాల్, వెంకటేష్…!

by AJAY
Ad

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాలను నమోదు చేసుకుంటాయి. అలాంటి చిత్రాలలో దృశ్యం సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించగా మీనా హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా విడుదలకు ముందు చిత్రంపై ఎలాంటి అంచనాలు లేవు కానీ థియేటర్ లో సినిమా చూసిన అభిమానులు ట్విస్టులు చూసి షాక్ అయ్యారు. దృశ్యం మలయాళ చిత్రానికి రీమేగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Advertisement

మలయాళ దృశ్యం సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించాడు. ఇక దృశ్యం బ్లాక్ బస్టర్ అవడంతో దానికి సీక్వెల్ గా దృశ్యం2 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ దృశ్యం 2 లోను మోహన్ లాల్ హీరోగా నటించగా తెలుగులో దృశ్యం 2 లో వెంకటేష్ హీరోగా నటించాడు.

Advertisement

ఇక దృశ్యం సినిమాను బాలీవుడ్ లో సైతం రీమేక్ చేశారు. బాలీవుడ్ రీమేక్ లో అజయ్ దేవగన్ శ్రీయ హీరో హీరోయిన్ లుగా నటించారు. అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. దాంతో దృశ్యం 2 సినిమాలో సైతం బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా నటించారు.

అయితే తెలుగు మలయాళ దృశ్యం 2 సినిమాలు అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో నేరుగా విడుదల చేశారు. కానీ బాలీవుడ్ లో దృశ్యం 2 సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. కాగా బాలీవుడ్ లో దృశ్యం 2 సినిమా భారీగా కలెక్షన్లను కొల్లగొట్టింది. కానీ వెంకటేష్ మోహన్ లాల్ తమ సినిమాలను ఓటిటి లో విడుదల చేయడం వల్ల కోట్ల రూపాయలను నష్టపోయారు.

Visitors Are Also Reading