Home » భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఆడిన 5 బెస్ట్ ఇన్నింగ్స్ ఇవే..!

భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఆడిన 5 బెస్ట్ ఇన్నింగ్స్ ఇవే..!

by Anji
Ad

భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ గురించి అందరికీ తెలిసిందే. యూవీ అనగానే తొలుత గుర్తుకొచ్చేది ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు. 2007 టీ 20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ పై ఆరు సిక్సులు కొట్టి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. భారత జట్టు ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు యువరాజ్. 2000 అక్టోబర్ లో కెన్యాతో మ్యాచ్ ద్వాారా అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్ కి గుడ్ బై చెప్పగా.. 40 టెస్ట్ లలో 1900 పరుగులు, 304 వన్డేలలో 8701 పరుగులు, 58 టీ 20లలో 1177 పరుగులు సాధించాడు. యువరాజ్ ఆడిన బెస్ట్ ఇన్నింగ్స్ ఓ సారి చూద్దాం. 

Advertisement

యువరాజ్ ఆడిన ఇన్నింగ్స్ అతని కెరీర్ లో నే హైలెట్. ఈ మ్యాచ్ లో 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకి గంగూలీ(60), సెహ్వాగ్ (45) తొలి వికెట్ కి 106 పరుగులు జోడించి పటిష్టమైన స్థితిలో నిలిపారు. స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ ఔటయ్యారు. ఆ తరువాత 146 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. అప్పుడు క్రీజ్ లోకి వచ్చిన యువరాజ్ మరో ఎండ్ లో మహ్మద్ కైఫ్ మంచి సమన్వయంతో ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లారు. ఆరో వికెట్ కి వీరిద్దరూ 221 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో టీమిండియాను గెలుపు దిశగా నడిపించారు. విజయాన్ని 59 పరుగులు అవసరమైన దశలో యూవీ ఔట్ అయ్యాడు. మహ్మద్ కైఫ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివరి వరకు క్రీజ్ లో నిలబడి టీమిండియాకి విజయాన్ని అందించాడు. టీమిండియా విజయం సాధించడంతో కెప్టెన్ గంగూలీ తన షర్ట్ ని విప్పి సెలబ్రేట్ చేయడం అప్పట్లో ఫేమస్ అయింది. 

Manam News

2004లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. సిడ్నీ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆసిస్ బౌలింగ్ ని సమర్థవంతంగా ఎదుర్కున్న యువరాజ్ సెంచరీ సాధించాడు. 122 బంతుల్లో 16 ఫోర్లు, రెండు సిక్సర్లతో 139 పరుగులు సాధించాడు. యువరాజ్ ధాటికి టీమిండియా 50 ఓవర్లలో 296 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ పద్దతిలో కంగారు జట్టు ఈ మ్యాచ్ గెలుచుకుంది.  

Also Read :  2022 సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటిన డబ్బింగ్ సినిమాలు

Advertisement

Yuvraj Singh recalls 6 sixes in 2007 World T20, reveals chat with Stuart  Broad's father | Cricket News - Times of India

2007 టీ20 ప్రపంచ కప్ ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఆండ్రూ ఫ్లింటాప్ తో గొడవ యువరాజ్ లోని విధ్వంసాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అతనికి నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న యూవీ టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా అర్థసెంచరీ సాధించిన తొలి ఆటగాడిలా నిలిచాడు. యూవీ జోరుతో టీమిండియా తొలిసారి టోర్నీలో 200 పరుగుల మార్క్ ను అందుకుంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది.  

Also Read :   Sanju Samson : టీమిండియాలో ఛాన్సులు రాక ఐర్లాండ్ కు ఆడనున్న సంజూ !

Manam News

2011 వన్డే వరల్డ్ కప్ లో యువరాజ్ ఆల్ రౌండర్ గా కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ పైనల్ లో 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 143 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన యూవీ తనలోని క్లాస్ ఆటను చూపించాడు. సురేష్ రైనా సహకారంతో 14 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు. 67 బంతుల్లో 57 పరుగులతో యువరాజ్ నాటౌట్ గా నిలిచాడు.  

Also Read :  ఆ బాలీవుడ్ హీరోయిన్ కోసం పేరు మార్చుకున్న కోహ్లీ

Manam News

తన కెరీర్ చివరి దశలో యువరాజ్ ఆడిన చివరి బెస్ట్  మ్యాచ్ ఇదే. ఇంగ్లాండ్ జరిగిన వన్డేలో 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. యువరాజ్ ధోనితో కలిసి మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో కదం తొక్కిన యువరాజ్ 127 బంతుల్లో 150 పరుగులు చేశాడు. యువీ తన వన్డే కెరీర్ లో అత్యధిక స్కోరుని అందుకున్నాడు. టీమిండియా 381 పరుగులు సాధించింది. 15 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ తరువాత యూవీ క్రమ క్రమంగా ఫామ్ కోల్పోయాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 

Also Read :  బంగ్లాదేశ్ తో తొలిటెస్ట్ కి భారత జట్టు ఇదే.. రిషబ్ పంత్ కి షాకిచ్చిన బీసీసీఐ..!

Visitors Are Also Reading