Home » బంగ్లాదేశ్ తో తొలిటెస్ట్ కి భారత జట్టు ఇదే.. రిషబ్ పంత్ కి షాకిచ్చిన బీసీసీఐ..!

బంగ్లాదేశ్ తో తొలిటెస్ట్ కి భారత జట్టు ఇదే.. రిషబ్ పంత్ కి షాకిచ్చిన బీసీసీఐ..!

by Anji
Ad

టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ కోసం ఇరు జుట్టు పూర్తిగా సిద్ధమయ్యాయి. ఇప్పటికే వన్డే సిరీస్ ని కైవసం చేసుకుంది బంగ్లాదేశ్ జట్టు. టెస్ట్ సిరీస్ లోనూ శుభారంభం చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా కనీసం టెస్ట్ సిరీస్ నైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. వన్డే సిరీస్ లో టీమిండియా ఆటగాళ్లు చాలా మంది గాయపడడంతో యువ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. రోహిత్ శర్మ గాయపడడంతో కే.ఎల్. రాహుల్ కి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ రెండు టెస్ట్ మ్యాచ్ ల టైమింగ్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు టెస్ట్ మ్యాచ్ లు 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పుడు మ్యాచ్ ల సమయాన్ని మార్చేసి తొమ్మిది గంటలకు మార్చేసారు. తొలిటెస్ట్ కి మ్యాచ్ టీమిండియాకి ప్రకటించింది. ఇద్దరూ కొత్త ఆటగాళ్లకి జట్టులో అవకాశం దక్కింది. 

Advertisement

రెండో మ్యాచ్ లో గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ మూడో వన్డేకు దూరమయ్యాడు. అదేవిధంగా చికిత్స కోసం ముంబైకి తిరిగి వచ్చిన రోహిత్ వైద్యుల సూచనల మేరకు టెస్ట్ కి దూరంగా ఉండనున్నాడు. రెండో టెస్ట్ కి రోహిత్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది డాక్టర్ రిపోర్టుపై ఆధారపడి ఉంటుంది. తొలి టెస్ట్ కి రోహిత్ కి బదులుగా అభిమన్యు ఈశ్వరన్ ని జట్టులోకి తీసుకున్నట్టు బీసీసీఐ తెలిపి రెండో టెస్టుకు రోహిత్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది డాక్టర్ రిపోర్టుపై ఆధారపడి ఉంటుంది. అందుకే తొలి టెస్టుకు రోహిత్‌కు బదులుగా అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.

Advertisement

కేవలం రోహిత్ మాత్రమే కాదు మరో ఇద్దరు భారత ఆటగాళ్లు బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కు దూరమయ్యారు. గతంలో గాయం కారణంగా జట్టుకు దూరమైన మహమ్మద్ షమీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయాలనుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. వారిద్దరూ ప్రస్తుత టెస్ట్ సిరీస్ లో ఆడలేరు. ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కి బదులుగా నవదీప్ సైని సౌరబ్ కుమార్ జట్టులోకి వచ్చారు. అదేవిధంగా జయదేవ్ ఉనద్కత్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ టెస్ట్ సిరీస్ లో టీమిండియాకు చతేశ్వర్ పూజార వయసు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇప్పటివరకు వైయస్ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ ను ఈ బాధ్యతల నుంచి తప్పించింది బీసీసీఐ. పాత కొంతకాలంగా రిసెప్ట్ వరుస వైఫల్యం చెందడంతో అతనికి ఇది హెచ్చరిక నే అని చెప్పవచ్చు.

తొలి టెస్ట్ కు భారత జుట్టు : 

కేఎల్ రాహుల్ (కెప్టెన్), పుజారా (వైస్ కెప్టెన్), శుబ్ మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరబ్ కుమార్, శ్రీకర్ భరత్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, నవదీప్ సైని.

Visitors Are Also Reading