Home » ఆ బాలీవుడ్ హీరోయిన్ కోసం పేరు మార్చుకున్న కోహ్లీ

ఆ బాలీవుడ్ హీరోయిన్ కోసం పేరు మార్చుకున్న కోహ్లీ

by Bunty
Ad

టీమిండియా స్టైలిష్ బ్యాట్స్మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కెరీర్ లో ఎన్నో కష్టాలు అనుభవించిన కోహ్లీ.. టీమిండియా సారధిగా ఎదిగాడు. టన్నులకు టన్నులు పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. కానీ అనూహ్యంగా తన కెప్టెన్సీ పదవిని కోల్పోయి.. ఇప్పుడు జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్నాడు. ఇదంతా పక్కకు పెడితే,

Advertisement

అయితే తాజాగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ల వివాహ బంధానికి ఐదు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ నేపథ్యంలోనే, ఈ జంటకు క్రీడాకారులు అలాగే వారి ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కోహ్లీ మరియు అనుష్క లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వీళ్లు రహస్యంగా ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. పెద్ద హడావిడి లేకుండానే, అనుష్క మెడలో తాళి కట్టాడు విరాట్ కోహ్లీ. 2017 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన ఇటలీలోని ఓ విలాసవంతమైన రిసార్ట్ లో అనుష్క మరియు కోహ్లీల వివాహం జరిగింది. కొంతమంది ఆత్మీయులు అలాగే స్నేహితుల మధ్యనే వీరి వివాహం జరిగింది. కానీ పెళ్లి తర్వాత ఈ జంట రిసెప్షన్ పెట్టి అందరిని ఆహ్వానించింది.

Advertisement

 

అయితే ఈ పెళ్లి కోసం కోహ్లీ మరియు అనుష్క శర్మ తమ తమ పేర్లు కూడా మార్చుకున్నారని తాజాగా బయటకు వచ్చింది. ఒకసారి ఈ విషయాన్ని అనుష్క శర్మ వెల్లడిస్తూ, తమ పెళ్లి ఏర్పాట్లు చేసేటప్పుడు ఫేస్బుక్ పేర్లను వాడినట్లు, కోహ్లీ తన పేరును రాహుల్ గా, తాను ఐశ్వర్య గా తమ పేర్లు మార్చుకున్నామని అనుష్క వెల్లడించింది. తమ పెళ్లి విషయంలో ఇలాంటి ఇబ్బందులు రాకూడదని నేపద్యంలోనే ఇలా చేసినట్లు ఆమె పేర్కొంది.

 

Read Also  : NRI లను పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డ 6 మంది టాలీవుడ్ హీరోయిన్లు వీళ్లే

Visitors Are Also Reading