Home » 2022 సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటిన డబ్బింగ్ సినిమాలు

2022 సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటిన డబ్బింగ్ సినిమాలు

by Bunty
Ad

కరోనా మహమ్మారి, ఓటీటీలు థియేటర్ వ్యవస్థ పై ప్రభావాన్ని చూపించిన సంగతి తెలిసిందే. దాంతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. సినిమాలకు కలెక్షన్లు కూడా తక్కువే వస్తున్నాయి. అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రం ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు. అయితే ఇలా 2022 సంవత్సరంలో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

వివేక్, అగ్నిహోత్రి డైరెక్షన్ లో తెరకెక్కిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని విమర్శకులను సైతం మెప్పించింది.

కేజిఎఫ్ కు సీక్వెల్ గా తెరకెక్కిన కేజీఎఫ్ 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న కేజిఎఫ్ 2 సినిమా యాక్షన్ సినిమాను ఇష్టపడే ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. మే నెలలో థియేటర్లలో విడుదలైన డాన్ మూవీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Advertisement

జూన్ నెలలో విడుదలైన విక్రమ్ మూవీ కూడా ప్రేక్షకుల అంచనాలను మించి మెప్పించింది. అదే నెలలో విడుదలైన చార్లీ 777 సినిమాకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

జూలై నెలలో రిలీజ్ అయిన రాకెట్రీ, గార్లీ సినిమాలు సైతం ప్రేక్షకుల అంచనాలను మించి మెప్పించాయి. సెప్టెంబర్ నెలలో విడుదలైన పోన్నియిన్ సెల్వన్ 1, బ్రహ్మాస్త్ర పార్ట్ 1 ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన కాంతార మూవీ అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గత నెలలో విడుదలైన లవ్ టుడే మూవీ కూడా ప్రేక్షకుల అంచనాలను మించి మెప్పించింది. ఈ నెలలో విడుదల కానున్న అవతార్ 2 మూవీకి రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి.

READ ALSO : Income Tax Raid : ఇన్ కమ్ టాక్స్ రైడ్స్ ఎలా చేస్తారు ? రైడ్ లో దొరికిన డబ్బును ఏం చేస్తారో తెలుసా ?

Visitors Are Also Reading