Home » నందమూరి ఫ్యామిలీలో నటుడిగా ఎదుగుతున్న టైంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మరో హీరో ఉన్నారు.. ఎవరంటే..!!

నందమూరి ఫ్యామిలీలో నటుడిగా ఎదుగుతున్న టైంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మరో హీరో ఉన్నారు.. ఎవరంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సాధించిన ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన కుమారుడు హరికృష్ణ, బాలకృష్ణ నటనలో తనదైన గుర్తింపు సాధించారు. ఇందులో బాలకృష్ణ స్టార్ హీరో గా కొనసాగుతున్నారు. ఇక నందమూరి వారసులు గా మూడోతరం మనవళ్ళు తారకరత్న,చైతన్య కృష్ణ , ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ రావు కూడా సినీ పరిశ్రమలో నిర్మాతగా కొనసాగారు. అలాగే ఆయన కుమారుడు కళ్యాణ్, హరిన్ చక్రవర్తి ఇండస్ట్రీలో నటులుగా అడుగు పెట్టారు.. అయితే ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.. ఆయన తర్వాత త్రివిక్రమరావు చిన్న కొడుకు హరిన్ చక్రవర్తి రోడ్డు ప్రమాదంలో మరణించారు.. తర్వాత కళ్యాణ్ చక్రవర్తి ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. అన్న బాటలో తాను కూడా పరిశ్రమలో అడుగు పెట్టారు.. హరిన్ మనుషుల్లో దేవుడు అనే మూవీ ద్వారా బాలనటుడిగా నటించిన హరిన్ 1986 లో మామా కోడళ్ళ సవాల్ మూవీలో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు.. తర్వాత పెళ్లి కొడుకు వస్తున్నాడు సినిమాలో యమధర్మరాజు గా నటించి మెప్పించాడు. ఇలా నటుడిగా పేరు పొందిన ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు దీంతో కొడుకు మృతి చెందడంతో కళ్యాణ్ చక్రవర్తి సినిమా లకు బై బై చెప్పేసి చెన్నైలో స్థిరపడ్డారనీ సమాచారం.. అయితే నందమూరి ఫ్యామిలీ లో ఎక్కువ మంది రోడ్డు ప్రమాదంలో మరణించడం చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య, ఎన్టీఆర్ పెద్ద కొడుకు హరికృష్ణ, హరికృష్ణ గారి పెద్ద కుమారుడు జానకిరామ్, రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ కూడా రోడ్డు ప్రమాదాలు జరిగి తీవ్ర గాయాలపాలై మరణం అంచుల వరకు వెళ్లి బతికి బట్ట కట్టారు.

Advertisement

ALSO READ;

Advertisement

బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు అందుకే ఫెయిల్ అయ్యాయంటూ గోపాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్స్..!!

ప్రభాస్, అనుష్క తో పాటు ఆ సెలబ్రిటీలకు పెళ్లి గండం….వేణు స్వామి సంచలన జ్యోతిష్యం…!

 

 

Visitors Are Also Reading