Home » ప్రభాస్, అనుష్క తో పాటు ఆ సెలబ్రిటీలకు పెళ్లి గండం….వేణు స్వామి సంచలన జ్యోతిష్యం…!

ప్రభాస్, అనుష్క తో పాటు ఆ సెలబ్రిటీలకు పెళ్లి గండం….వేణు స్వామి సంచలన జ్యోతిష్యం…!

by AJAY
Ad

వేణు స్వామి ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన జ్యోతిషంతో వేణు స్వామి ఎంతో పాపులర్ అయ్యారు. ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జ్యోతిష్యం చెబుతూ వేణు స్వామి పేరు సంపాదించుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది…. సినిమాల్లో ఏ హీరోయిన్ సక్సెస్ అవుతుంది.. ఏ హీరో హీరోయిన్ల పెళ్లిళ్లు పెటాకులు అవుతాయి ఇలా ఎన్నో విషయాలను వేణు స్వామి ముందే చెబుతుంటారు. అందువల్లే స్వామి కి ఇంత క్రేజ్ వచ్చింది.

Rashmika venu swami

Advertisement

స్వామి చెప్పిన జ్యోతిషంలో సమంత నాగ చైతన్య విడాకుల విషయం కూడా ఒకటి. సమంత నాగ చైతన్య విడిపోవడంతో వేణు స్వామి జ్యోతిష్యానికి డిమాండ్ కూడా పెరిగింది. ఇదిలా ఉంటే వేణు స్వామి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి తన సంచలన జ్యోతిషాన్ని బయటపెట్టారు. టాలీవుడ్ లోని పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్ల జీవితాలలో పెళ్లి వచ్చి రాదని చెప్పాడు.

వాళ్ళు పెళ్లి చేసుకున్నా విడాకులు తీసుకుంటారని వేణు స్వామి స్పష్టం చేశారు. ఆ లిస్ట్ లో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నయనతార కూడా ఉన్నారు.

Advertisement

Nayanatara Vignesh shivan

Nayanatara Vignesh shivan

అదే విధంగా రష్మిక, అనుష్క సైతం పెళ్లిళ్లు చేసుకున్నా వైవాహిక జీవితంలో కొనసాగరని చెప్పారు. అంతేకాకుండా హీరో ప్రభాస్ జాతకం కూడా ఇలాగే ఉందని తెలిపారు.

ప్రభాస్ జాతకంలో గురువు నీచ స్థానంలో ఉన్నాడని అందువల్ల పెళ్లి చేసుకున్నా జీవితం సంతోషంగా ఉండదని వేణుస్వామి తెలిపారు. సమంత విషయంలో కూడా గురుడు నీచ స్థానంలో ఉండటం వల్ల ఆమె జీవితం ఇలా అయిందని వేణు స్వామి చెప్పారు. అలా ఉండటం వల్ల వాళ్ళ వైవాహిక బంధం కొనసాగదు అని చెప్పాడు. కాబట్టి నయనతార, రష్మిక, అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండరని స్పష్టం చేశారు.

Also read :

వైఎస్ఆర్ నిజంగా ఆ డైలాగ్ చెప్పాడా…? పరుశురామ్ కామెంట్స్ పై నెటిజన్లు ఫైర్…!

“రంగస్థలం” కథను చిరంజీవి నటించిన ఆ సినిమా నుండి కాపీ కొట్టారా…?

Visitors Are Also Reading