Home » బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు అందుకే ఫెయిల్ అయ్యాయంటూ గోపాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్స్..!!

బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు అందుకే ఫెయిల్ అయ్యాయంటూ గోపాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్స్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరున్న రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఆయన సినిమాల యొక్క ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోల యొక్క బాడీ లాంగ్వేజిని బట్టి కథలు రాస్తూ సినిమాలు తీస్తూ ఉంటారు. అందులో సీన్లు కూడా వారికి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగానే ఉంటాయి. అయితే ఆచార్య మూవీలో చిరంజీవి నక్సలైట్ పాత్రను పోషించారని ఆ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి పరిమితులకు లోబడి మాత్రమే పర్ఫామెన్స్ చేశారని పరుచూరి కామెంట్ చేశారు. చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ మూవీలో నటించే సమయంలో ఆ మూవీ మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కు అస్సలు కుదరదని నేను చెప్పానని పరుచూరి తెలియజేశారు.చిరంజీవి ఇమేజ్ మహావృక్షం లాంటిది అని,ఆయన శాంతి వచనాలు పలికితే ప్రేక్షకులకు నచ్చదని గోపాలకృష్ణ అన్నారు. అయితే చిరంజీవికి ఈ విషయాన్ని నేను చెబితే మీరు రెబల్ కాబట్టి మీకు నచ్చదని ఆయన అన్నారు అని పరుచూరి గోపాలకృష్ణ తెలియజేశారు. సీనియర్ ఎన్టీఆర్ శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు మూవీలో నటిస్తే ఆ సినిమా కూడా ఈ విధంగానే ఫ్లాప్ అయిందని పరుచూరి కామెంట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి నుండి ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలను ఆశిస్తారని ఆయన అన్నారు. బాలకృష్ణ అల్లరిపిడుగు చేసే టైంలో తండ్రి పాత్రలో కూడా ఆయనే చేయాలని కోరితే దర్శక నిర్మాతలు మాత్రం అంగీకరించకపోవడంతో ఆ సినిమా ఫెయిల్ అయ్యిందని గోపాలకృష్ణ కామెంట్ చేశాడు. అల్లరి పిడుగు మూవీలో పరిచయం లేని నటుడికి బాలయ్య భయపడినట్టు చూపించారని అందుకే సినిమా ఫెయిల్ అయిందని పరుచూరి అన్నారు. ప్రస్తుతం గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే చిరంజీవి బోలాశంకర్ సినిమా లో చేస్తుండగా, బాలయ్య మాత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే.

Advertisement

ALSO READ :

Advertisement

అల్లుఅర్జున్ వ‌రుడు సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ప్ర‌స్తుతం ఏం చేస్తుందంటే..?

ప్రభాస్, అనుష్క తో పాటు ఆ సెలబ్రిటీలకు పెళ్లి గండం….వేణు స్వామి సంచలన జ్యోతిష్యం…!

 

 

 

Visitors Are Also Reading