Home » అక్టోబ‌ర్ నెల‌లో ఈ వ్యాధులు వ్యాపించే ప్ర‌మాదం ఉంది జాగ్ర‌త్త‌..!

అక్టోబ‌ర్ నెల‌లో ఈ వ్యాధులు వ్యాపించే ప్ర‌మాదం ఉంది జాగ్ర‌త్త‌..!

by Anji
Ad

అక్టోబ‌ర్ నెల‌లో ర‌క‌ర‌కాల వ్యాధులు వ‌చ్చే ప్ర‌మాద‌ముంది. వాస్త‌వానికి ఈ నెల‌లో వ‌ర్షాలు నెమ్మ‌దిగా త‌గ్గిపోయి చ‌లికాలం ప్రారంభం అవుతుంది. సెప్టెంబ‌ర్ నెల‌లో కురిసిన నీరు అలాగే నిలిచిపోవ‌డంతో మురికి మురికిగా మారుతాయి. అంతేకాదు.. అక్టోబ‌ర్ నెల‌లో ప‌లు బ్యాక్టీరియా, వైర‌ల్ వ్యాధులు పెరిగే అవ‌కాశ‌ముంది. సెప్టెంబ‌ర్ నెల‌లో వ‌చ్చే వ్యాధుల వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంది. అక్టోబ‌ర్ నెల‌లో ఏయే వ్యాధులు వ్యాపిస్తాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

డెంగ్యూ జ్వ‌రం :

డెంగ్యూ జ్వ‌రం వ్యాప్తి చెందుతుంద‌నే భ‌యం ఈ రోజుల్లో చాలా మందిలో క‌నిపిస్తోంది. సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్‌ల‌లో ఎక్కువ‌గా ఉంటుంది. ఈ వ్యాధి ఆడ ఎడీస్ దోమ కుట్ట‌డం ద్వారా వ్యాపిస్తుంది. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న రోగుల ర‌క్తంలో ప్లేట్లెట్ల సంఖ్య త‌గ్గ‌డం ప్రారంభం అవుతుంది. డెంగ్యూలో మీకు అధిక జ్వ‌రం, క‌ళ్ల‌లో నొప్పి, మెడ‌, ఛాతీలో నొప్పి, ఆక‌లి లేక‌పోవ‌డం వాంతులు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించండి.

చికెన్ గున్యా :

సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్ నెల‌లో ఎక్కువ‌గా చికెన్ గున్యా వ్యాధి వ్యాప్తి చెందే ప్ర‌మాద‌ముంది. ఈ వ్యాధి దోమ‌లు కుట్ట‌డం ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఈ వ్యాధితో బాధ‌ప‌డుతున్న రోగుల‌కు 104 డిగ్రీల జ్వ‌రం వ‌స్తుంది. చికున్ గున్యా విష‌యంలో జ్వ‌రంతో పాటు జ‌లుబు, శ‌రీరంలో వాపు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి. అలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించండి.

Advertisement

మ‌లేరియా : 

సెప్టెంబ‌ర్-అక్టోబ‌ర్ నెల ప్రారంభం కాగానే మ‌లేరియా వ్యాపిస్తుంద‌నే భ‌యం చాలా ఎక్కువ‌. ఈ ప‌రిస్థితిలో బాధ‌ప‌డుతున్న రోగుల్లో అధిక జ్వ‌రంతో పాటు వ‌ణుకు, త‌ల‌నొప్పి, వాంతులు చెమ‌ట‌లు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఇదే కాకుండా రోగుల‌కు కండ‌రాల నొప్పి, అతిసారం ఉండ‌వ‌చ్చు.

వైర‌ల్ జ్వ‌రం : 

సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్ నెల‌లో వైర‌ల్ ఫీవ‌ర్ కూడా చాలా ఎక్కువ‌గా ఉంటుంది. దీని ల‌క్ష‌ణాలు దాదాపు డెంగ్యూ, చికెన్ గున్యా, మ‌లేరియాను పోలి ఉంటాయి. అందుకే కొద్ది మంది వైర‌ల్ ఫీవ‌ర్ లో తిక‌మ‌క‌ప‌డుతుంటారు. వాంతులు, అధిక జ్వ‌రం, నాసికా ర‌ద్దీ, గొంతునొప్పి వంటివి అనిపిస్తే వెంట‌నే వైద్యుల స‌ల‌హా తీసుకోండి.

Also Read :  కూతురు చేసిన ప‌నికి రూ.100 కోట్లు పోగొట్టుకున్న కృష్ణంరాజు

కంటి ప్లూ

ఇన్‌ప్లూ ఎంజా వైర‌స్ కార‌ణంగా ప్లూ వ‌స్తుంద‌నే భ‌యం సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్‌ల‌లో ఎక్కువ‌గా ఉంటుంది. ఇక ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న రోగుల కళ్లు చాలా ఎర్ర‌గా క‌నిపిస్తాయి. ఇది కాకుండా క‌ళ్ల‌లో నొప్పి, మంట ఉంది.

Also Read :  Chanakya Niti : భార్య భ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమ ఉండాలంటే ఇవి త‌ప్ప‌కుండా పాటించాలి..!

Visitors Are Also Reading