Home » Chanakya Niti : భార్య భ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమ ఉండాలంటే ఇవి త‌ప్ప‌కుండా పాటించాలి..!

Chanakya Niti : భార్య భ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమ ఉండాలంటే ఇవి త‌ప్ప‌కుండా పాటించాలి..!

by Anji
Ad

ఆచార్య చాణ‌క్య గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈయ‌న గొప్ప విద్యావేత్త‌. బుద్ధిబ‌లం క‌ల‌వాడు. చాణ‌క్యుడు ర‌చించిన నీతి శాస్త్రాన్ని ఇప్ప‌టికీ ఎంతో మంది అనుస‌రిస్తున్నారు. ఒక మనిషి జీవితంలో ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకోవాలి.

Advertisement

ఎవ‌రితో ఎలా ఉండాలి ఇలా త‌దిత‌ర విష‌యాల‌ను చాణ‌క్యుడు నీతి శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ఈ నీతిశాస్త్రంలో భార్య భ‌ర్త‌లు క‌ల‌కాలం ప్రేమ‌గా సంతోషంగా ఉండాలంటే ఈ విష‌యాల‌ను పాటించాల‌ని చాణ‌క్య చెప్పారు. ఆ విష‌యాలు ఏంటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

భార్య‌, భ‌ర్త‌ల సంబంధంలో సందేహాలు అనేవి ఉండ‌కూడ‌దు. ఎప్పుడు ఒక‌రిపై న‌మ్మ‌కం ఉండాలి. ఇద్ద‌రి మ‌ధ్య సందేహాలుంటే ఆ సంబంధం నాశ‌న‌మ‌వుతుంది. భాగ‌స్వామిని ఎప్పుడు అవ‌మానించ‌కూడ‌దు. మీ భాగ‌స్వామి గురించి ఏవైనా సందేహాలు ఉంటే వెంట‌నే అడ‌గ‌డం ద్వారా సందేహాలు ఆలోచ‌న‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. చాణ‌క్య ప్ర‌కారం.. భార్య‌భ‌ర్త‌ల సంబంధంలో అహంకారం అస్స‌లు ఉండ‌కూడ‌దు. ఇది మీ సంబంధంలోని వివాదాల‌కు కార‌ణం కావ‌చ్చు. అహంకారం వ‌ల్ల భాగ‌స్వామి నుంచి దూరం చేస్తుంది. కాబ‌ట్టి అహంకారాన్ని దూరంగా ఉండడం బెట‌ర్‌.

Advertisement

Also Read : Chanakya Niti : విజయం సాధించాలంటే చాణక్య చెప్పిన ఈ 4 మార్గాలు అనుస‌రించండి..!

భార్య‌, భ‌ర్త‌ల ప్రేమ‌లో ఎటువంటి మోసం ఉండకూడ‌దు. ప్రేమ‌ను జీవిత భాగ‌స్వామికి తెలియ‌జేయ‌డం ఏకైక మార్గం స్వ‌చ్ఛ‌త అని చాణ‌క్యుడు తెలియ‌జేశారు. మ‌నిషి స్వార్థం కంటే ప్రేమ‌కు లొంగిపోతాడు. భార్య‌, భర్త‌ల సంబంధంలో ఒక‌రినొక‌రు స్వేచ్ఛ‌ను ఇచ్చుకోవాలి. చిన్న చిన్న‌విష‌యాల‌కు ఒక‌రికొక‌రు నిదించుకూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల సంబంధాల‌పై ప్ర‌భావం చూపిస్తుంది. అందుకే ఒక‌రిపై ఒక‌రికి న‌మ్మ‌కం అనేది ఉండాలి. అప్పుడే భార్య‌, భ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమ క‌ల‌కాలం ఉంటుంది.

Also Read :  Chanakya Niti : ఈ మూడు ల‌క్ష‌ణాలు క‌లిగిన స్త్రీలు కుటుంబంలో సంతోషం లేకుండా చేస్తార‌ట‌..!

 

Visitors Are Also Reading