Home » brahmanandam: ఇండస్ట్రీలో అలాంటి తేడాలు ఉండవు.. ఏదైనా ఒకటే బ్రహ్మానందం కామెంట్స్ వైరల్..!!

brahmanandam: ఇండస్ట్రీలో అలాంటి తేడాలు ఉండవు.. ఏదైనా ఒకటే బ్రహ్మానందం కామెంట్స్ వైరల్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ కమెడియన్లలో బ్రహ్మానందం మొదటి స్థానంలో ఉంటారు. అలాంటి కమెడియన్ బ్రహ్మానందం సినిమాలో ఉన్నారు అంటే తప్పనిసరిగా ఆ చిత్రం చూసినవారు కడుపుబ్బా నవ్వాల్సిందే.అంతటి కామెడీ పీస్ బ్రహ్మానందం.. ఆయన ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం వయసు మీద పడడంతో కథ బలంగా ఉన్న సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు.తాజాగా బ్రహ్మానందం నటించిన పంచతంత్రం మూవీ ఎంతటి విజయం అందుకుందో మనందరికీ తెలుసు.

Advertisement

 

also read:Pooja Hegde: తెలుగులో పూజ హెగ్డే కి అవకాశాలు రాకుండా చేస్తుంది వారేనా..?

Advertisement

ఇకపోతే తాజాగా బ్రహ్మానందం చెడ్డి గ్యాంగ్ తమాషా అనే సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వెంకట్ కళ్యాణ్ హీరోగా ఆయన డైరెక్షన్లోనే గాయత్రి పటేల్ హీరోయిన్ గా వస్తున్న చెడ్డి గ్యాంగ్ తమాషా కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. హాస్యనటులు తీసే సినిమాలు సక్సెస్ అవ్వాలని, హాస్యం అనేది బయటకు రావాలని తమ గురువు జంధ్యాల ఎప్పుడు చెబుతుండే వారిని మరోసారి గుర్తు చేసుకున్నారు.

ఆశయాన్ని బ్రతికించడమే నా ప్రధాన లక్ష్యమని అందుకే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యానని తెలియజేశారు. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమీ ఉండదని, కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి గుర్తు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడిన మాటలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

also read:

Visitors Are Also Reading