Home » వాల్తేరు వీరయ్యలో రవితేజ పాత్ర నిడివి ఎంతో తెలుసా ?

వాల్తేరు వీరయ్యలో రవితేజ పాత్ర నిడివి ఎంతో తెలుసా ?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రానికి యువ దర్శకుడు బాబీ (కే.ఎస్. రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే రవితేజకి సంబంధించిన టీజర్ విడుదలై అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 

Advertisement

తెలంగాణ యాసలో రవితేజ వావ్ అనిపించారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో రవితేజ 40 నిమిషాల పాటు కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. సినిమా టోటల్ లెంగ్స్ 2 గంటల 35 నిమిషాలు ఉండనున్నట్టు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సంక్రాంతి బరిలో వస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, సాంగ్స్, రవితేజ టీజర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన ‘నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా’ అంటూ సాగే పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది.  

Advertisement

Also Read :  యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా..?

 ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. మరోవైపు ఇప్పటికే సంక్రాంతి రేసులో తమిళ హీరోలు అజిత్ తునివు, విజయ్ దళపతి వారసుడు, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డిలు విడుదలవుతున్నాయి. వీటితో మరో రెండు చిన్న సినిమాలు కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి సమరంలో ఏ సినిమా పండుగకు విజేతగా నిలుస్తుందో చూడాలి. 

Also Read :  నాగార్జున పక్కకు పెట్టేసిన బిగ్ బాస్.. సీజన్ 7 కి హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ..!

Visitors Are Also Reading