Home » Pooja Hegde: తెలుగులో పూజ హెగ్డే కి అవకాశాలు రాకుండా చేస్తుంది వారేనా..?

Pooja Hegde: తెలుగులో పూజ హెగ్డే కి అవకాశాలు రాకుండా చేస్తుంది వారేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

నాగచైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే. కానీ మొదటి సినిమాతో ఈమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమాలో కూడా ఈమెకు అంతగా సక్సెస్ రాలేదు. ఇక తెలుగులో సక్సెస్ రాకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. ఇక పూజ హెగ్డే కి అక్కడ కూడా నిరాశే మిగలడంతో మళ్లీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ టైంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పూజ హెగ్డే కి అవకాశాలు వెళ్లువెత్తాయి.

Advertisement

also read;క్రికెట్ గ్రౌండ్ లో సిక్సర్ల తుఫాను సృష్టించిన తన్మయ్ సింగ్..!

ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అల్లు అర్జున్ సరసన అలవైకుంఠపురంలో ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి తన ఖాతాలో బ్లాక్ బస్టర్ సినిమాలను వేసుకుంది. దీంతో ఎవరైతే ఈమెను ఐరన్ లెగ్ అని పిలిచారో వాళ్లే గోల్డెన్ లెగ్ గా ఈమెను మెచ్చుకున్నారు. ఇక పాన్ ఇండియా సినిమాగా తెరికెక్కిన రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ సరసన నటించింది పూజ హెగ్డే. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అవడంతో పూజ హెగ్డే కి బ్యాడ్ టైం మొదలైంది. ఇక ఆ తర్వాత ఈమె నటించిన ఆచార్య,బీస్ట్ సినిమాలు వరుసగా ప్లాఫ్ అవడంతో పూజ హెగ్డే మళ్లీ ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే చాలామంది దర్శక నిర్మాతలు పూజ హెగ్డే ని తమ సినిమాల్లో తీసుకోవడానికి భయపడుతున్నారట.

Advertisement

ఎందుకంటే ఈమె నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండడంతో ఈ హీరోయిన్ కి అవకాశం ఇవ్వడానికి జంకుతున్నారట. ఇక ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో కేవలం ఒకే ఒక సినిమా ఉంది. అదే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా. ఇక ఈ సినిమా తప్పితే మరొక ప్రాజెక్టు ఈ హీరోయిన్ చేతిలో లేదు. అయితే ప్రస్తుతం ఈ విషయం తెలిసిన చాలామంది ఇండస్ట్రీ జనాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజ హెగ్డే పని అయిపోయింది అంటూ గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్న సినిమా గనుక సక్సెస్ అయితే మళ్లీ పూజ హెగ్డే కి వరుస చాన్సులు వస్తాయని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

also read;

Visitors Are Also Reading