Home » ప‌రిగ‌డుపున ఈ పండు తింటే చాలు.. లాభాలు ఎన్నో..!

ప‌రిగ‌డుపున ఈ పండు తింటే చాలు.. లాభాలు ఎన్నో..!

by Anji
Ad

సాధార‌ణంగా పండ్లు తింటే ఆరోగ్యానికి ప్ర‌యోజ‌నాలు చాలానే ఉంటాయి.ప్ర‌కృతిలో ల‌భించే పండ్ల‌లో పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. అందుకే ఏ సీజ‌న్‌లో వ‌చ్చే ఆ పండ్ల‌ను త‌ప్ప‌క తింటుంటాలి. పండ్ల‌లో ల‌భించే పోష‌కాలు ఎందులో ల‌భించ‌వు. ఇక కీవిలో అయితే పుష్క‌లంగా పోష‌కాలుంటాయి. ప్ర‌తి రోజు ఉద‌యం వేళ‌లో ప‌రిగ‌డుపున ఈ పండు తింటే మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. విట‌మిన్ ఏ, విట‌మిన్ సి, విట‌మిన్ కే, విట‌మిన్ బీ6 ఉండ‌డం వ‌ల్ల ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు తొలిగిపోతాయి.

ఇవి కూడా చ‌ద‌వండి :  Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కీల‌క విష‌యాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి

Advertisement


క‌రోనా మ‌హ‌మ్మారి సంభ‌వించిన త‌రువాత చాలా మంది రోగ నిరోధ‌క శ‌క్తిపై శ్ర‌ద్ధ పెట్టారు. కీవీ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో ఉండే విట‌మిన్ సీ, విట‌మిన్ కే రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.  ప్ర‌తిరోజు ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో కీవి పండ్ల‌ను తింటే ద‌గ్గు, జలుబు వంటి సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.  కీవి పండ్ల‌ను ఉద‌యం ప‌రిగ‌డుపున తిన‌డం ద్వారా గుండెల్లో మంట వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇక ఈ పండు తింటే ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అదేవిధంగా గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండ్లలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో పొట్ట సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఉద‌యాన్నే ప‌రిగ‌డుపున కీవీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల పొట్ట శుభ్రంగా ఉంటుంది. అదేవిధంగా మ‌ల‌బ‌ద్ధ‌కం, గ్యాస్‌, ఎసిడిటీ స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి.

Advertisement

ఇవి కూడా చ‌ద‌వండి :  ట్విన్ ట‌వ‌ర్ల కూల్చివేత స‌మ‌యంలో ఫ్లాట్‌లో నిద్రపోయిన వ్య‌క్తి.. ఆ త‌రువాత ఏం జ‌రిగిందో తెలుసా..?


పోష‌కాలు అధికంగా క‌లిగిన కీవి పండ్ల‌ను తింటే శ‌రీరంలో పోష‌కాల కొర‌త‌ను తీరుస్తుంది. ప్ర‌తీ రోజు కీవి పండ్ల‌ను తింటే బ‌రువు త‌గ్గుతారు. ఖాళీ క‌డుపుతో వీటిని తిన‌డం వ‌ల్ల ఎక్కువ సేపు ఆక‌లి వేయ‌దు. దీని ద్వారా మీరు అధికంగా క్యాల‌రీలు ఉన్న ఆహారాన్ని తీసుకోకుండా నివారించ‌వ‌చ్చు. కీవి పండ్ల‌లో పోష‌కాలు, మిన‌ర‌ల్స్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కొంత మంది ఆరోగ్యంగా ఉండ‌డానికి కీవి పండ్ల‌ను అధిక మోతాదులో తీసుకుంటారు. అలా తిన‌డం ద్వారా అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకున్న‌ట్టే. కీవిని ఎక్కువ‌గా తిన‌డం ద్వారా క‌డుపునొప్పి, అల‌ర్జీ, కిడ్నీ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. చాలా మంది వైద్యులు కీవి పండ్ల‌ను రోజుకు మూడు కంటే ఎక్కువ‌గా తీసుకోవ‌ద్ద‌ని సూచిస్తున్నారు. కేవ‌లం ఒక గ్లాస్ కీవి జ్యూస్ మాత్ర‌మే తాగాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. దేనినైనా మితంగా తీసుకుంటేనే ఉప‌యోగం ఉంటుంది. అధికంగా తీసుకుంటే వాటి వ‌ల్ల‌ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

ఇవి కూడా చ‌ద‌వండి :  చనిపోయేముందు నటుడు రఘువరన్ ఫ్రెండ్స్ ను పిలిచి ఎందుకు పార్టీ ఇచ్చారు..?

Visitors Are Also Reading