Home » ఆర్టీసీ బ‌స్సులో నోట్ల క‌ట్ట‌ల క‌ల‌క‌లం.. ఎక్క‌డంటే..?

ఆర్టీసీ బ‌స్సులో నోట్ల క‌ట్ట‌ల క‌ల‌క‌లం.. ఎక్క‌డంటే..?

by Anji
Ad

కొద్ది రోజుల క్రిత‌మే ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సులో నాలుగు కోట్ల‌కు పైగా న‌గ‌దు ప‌ట్టుబ‌డిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రొక ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా గ‌రిక‌పాడు చెక్ పోస్ట్ వ‌ద్ద ఆర్టీసీ బ‌స్సులో త‌ర‌లిస్తున్న న‌గ‌దును పోలీసులు ప‌ట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున హ‌వాలా డ‌బ్బు ప‌ట్టుబ‌డి జిల్లాలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. జిల్లాలోని జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం గ‌రిక‌పాడు రాష్ట్ర స‌రిహ‌ద్దు చెక్‌పోస్ట్ వ‌ద్ద పోలీసులు య‌థావిదిగా వాహ‌నాల త‌నిఖీలు నిర్వ‌హించారు.

Advertisement

హైద‌రాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసి బ‌స్సును పోలీసులు త‌నిఖీ చేసారు. బ‌స్సులో ఓ వ్య‌క్తి అనుమాన‌స్ప‌దంగా క‌నిపించ‌డంఓత అత‌ని వ‌ద్ద ఉన్న బ్యాగ్‌ను చూసి పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వెంట‌నే అత‌ని బ్యాగ్ ను త‌నిఖీ చేప‌ట్ట‌గా పెద్ద‌మొత్తంలో డ‌బ్బు ల‌భించింది.

Advertisement

తెలంగాణ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌స్తున్న ఆర్టీసీ బ‌స్సులో పోలీసులు దాదాపు రూ.2కోట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్‌లో డ‌బ్బు క‌ట్ట‌లు చూసి బ‌స్సులోని ప్ర‌యాణికుల‌తో పాటు పోలీసులు నివ్వెర‌పోయారు. డ‌బ్బును చిల‌క‌ల పోలీస్ స్టేష‌న్‌కు త‌రలించారు. ఎవ‌రూ ఆ ల‌గేజీని బుక్ చేశారు..? ఎవ‌రికీ చేర‌వేస్తున్నారు. వంటి అంశాల‌పై పోలీసుల ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ సోదాల్లో బ‌స్సు డ్రైవ‌ర్ క్లీన‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి:

  1. వామ్మో.. స‌లేశ్వ‌రం జాత‌ర‌కు వెళ్లే వాహ‌నాల‌కు టోల్ ఛార్జీ ఎంతో తెలుసా..?
  2. ఆ స్టార్ హీరో సినిమాలో రష్మిక ఐటం సాంగ్ చేయబోతుందా..!!
  3. ఊరంతా ఫ్లెక్సీలు, అధికారుల ఫోన్ నెంబర్లు.. ఆ ఊరికి వెళ్లాలంటే వణుకుతున్న అధికారులు.. ఎక్కడది..!
Visitors Are Also Reading