Home » ఆ స్టార్ హీరో సినిమాలో రష్మిక ఐటం సాంగ్ చేయబోతుందా..!!

ఆ స్టార్ హీరో సినిమాలో రష్మిక ఐటం సాంగ్ చేయబోతుందా..!!

by Sravanthi Pandrala Pandrala

సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడూ ఒకేలా ఉంటే ప్రేక్షకుల ఆదరణ ఉండదు. కాబట్టి మార్పులు చేర్పులు చేస్తూనే ఉండాలి. ప్రస్తుతం సినిమా అంటే పెద్ద హీరో అయినా సరే చిన్న హీరో అయినా సరే ఐటెం సాంగ్ తప్పనిసరి అయిపోయింది. అప్పట్లో ఐటెం సాంగ్ అంటే ఏవో కొన్ని సినిమాల్లో మాత్రం చేసేవారు. కానీ ప్రస్తుతం ఐటమ్ సాంగులకు పెరిగిన క్రేజ్ తో ప్రతి సినిమాలో సాంగ్ తప్పనిసరి అంటున్నారు. దీనికోసం అప్పట్లో అయితే స్పెషల్ గా ఎవరో ఒకరు ఉండేవారు. కానీ ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్లు కూడా ఐటమ్ సాంగ్ చేస్తామని ముందుకు వస్తున్నారు.

దీంతో ఐటెం సాంగ్ అంటే ప్రేక్షకులకు చాలా స్పెషల్ గా మారిపోయింది. ఐదు నిమిషాలు వారి అందాలను ఆరబోసేందుకు కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నారు. ఈ తంతు జనతా గ్యారేజ్ సినిమాతో మొదలైంది. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్.. సరిలేరు నీకెవ్వరు, కే జి ఎఫ్ చిత్రాల్లో తమన్నా.. రంగస్థలం మూవీలో పూజా హెగ్డే లాంటి పెద్ద హీరోయిన్లు స్పెషల్ సాంగ్ తొ అభిమానులకు చెమటలు పట్టించారు. ఈ మధ్యనే వచ్చినటువంటి పుష్ప సినిమాలో ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా అంటూ సమంత తన అందాలను ఆరబోసి తన స్టెప్పులతో కుర్రకారు గుండెలు పిండేసింది. ఇప్పటికీ ఆ పాట ఓ ఊపు ఊపేస్తుంది.

ఈ లిస్ట్ లోకి నేను కూడా చేరుతానని మరో టాప్ హీరోయిన్ అంటోంది. ఆవిడే రష్మిక మండాన. తాజా సమాచారం ప్రకారం రష్మిక ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ క్రియేట్ చేసిన సందీప్ వంగ.. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లిస్టులో ఉన్నాడు. ఆయన మళ్లీ బ్లాక్ బ్లాస్టర్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. దీంతో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో ఒక సినిమా తీస్తున్నారు సందీప్. ఈ మూవీలో హీరోయిన్ గా పరిణీతి చోప్రా నటిస్తుండగా, స్పెషల్ సాంగ్ కోసం రష్మిక ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈమె డేట్స్ కోసం సందీప్ వంగ ట్రై చేస్తున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది.

Visitors Are Also Reading