Home » ఊరంతా ఫ్లెక్సీలు, అధికారుల ఫోన్ నెంబర్లు.. ఆ ఊరికి వెళ్లాలంటే వణుకుతున్న అధికారులు.. ఎక్కడది..!

ఊరంతా ఫ్లెక్సీలు, అధికారుల ఫోన్ నెంబర్లు.. ఆ ఊరికి వెళ్లాలంటే వణుకుతున్న అధికారులు.. ఎక్కడది..!

by Sravanthi Pandrala Pandrala

పూర్వకాలంలో ఊరి పెద్ద కానీ, ఎవరైనా అధికారి వస్తున్నారంటే ప్రజలు భయంతో వణికిపోయేవారు. అందులో ముఖ్యంగా పోలీసులను కానీ, బ్యాంకు అధికారులను కానీ చూస్తే హడలెత్తి పోయేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది. అందరు చదువుకుంటున్నారు. ప్రశ్నించేతత్వం పెరిగింది. ఏదైనా పని చేస్తానని చేయకుంటే గల్ల పట్టి మరి అడుగుతున్నారు. అలాంటిదే ఈ గ్రామంలో చోటుచేసుకుంది. మరి ప్రజలు ఏం చేశారో తెలుసుకుందామా..!

కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండల కేంద్రానికి సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు నడుస్తున్నాయి. అయితే ఈ పనులు మూడు సంవత్సరాలు అయినా సరే పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే పాత బ్రిడ్జి కూడా కూలిపోయే దశకు చేరుకుంది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారు. కొత్త బ్రిడ్జి ఎప్పుడు ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం కూడా చెల్లించలేదు. బ్రిడ్జి నిర్మాణం అవుతుందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప పని మాత్రం జరగడం లేదు.

దీంతో కోపానికి వచ్చిన రైతన్నలు అధికారుల నిర్లక్ష్యం పై ఒక బ్యానర్ కట్టి అందులో వారి పేర్లు హోదా రాసి వారి ఫోన్ నెంబర్లు ఉన్నటువంటి ఒక పెద్ద ఫ్లెక్సీని కట్టేసారు. ముందుగా ఒక రైతు ఈ ఆలోచన వచ్చి ఫ్లెక్సీ కట్టాడు. అధికారులు వచ్చి చించేశారు. ఆ రైతు ఆలోచన మిగతా వారికి కూడా వచ్చింది ఊరంతా కలిసి ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు కట్టారు. దీంతో అధికారులకు ఏం చేయాలో అర్థం కాక మిన్నకుండిపోయారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చేరింది. ఇదండీ రైతుల పవర్ అంటూ నెటిజన్లు రైతులకు మద్దతు పలుకుతున్నారు. ఈ విషయం కాస్త వైరల్ గా మారడంతో కాంట్రాక్టర్లు అధికారులు తలలు పట్టుకుని ఆలోచిస్తున్నారు.

ఇది కూడా చదవండి:

ఉదయ్ కిరణ్ తో నటించిన ఈ నటులు.. ఎందుకు చనిపోయారు మీకు తెలుసా..!

SUNNY LEONE : స‌న్నిలియోన్ ఫ్యాన్స్ కు బంప‌రాఫ‌ర్..అక్క‌డ చికెన్ పై డిస్కౌంట్…!

అంబేద్క‌ర్ జ‌యంతి ఆఫ‌ర్..అక్క‌డ రూపాయికే లీట‌ర్ పెట్రోల్…!

 

Visitors Are Also Reading